Begin typing your search above and press return to search.
1981 - 1996 మధ్యలో పుట్టిన వాళ్లకు సెక్స్ కోరికలు తగ్గుతున్నాయా?
By: Tupaki Desk | 22 Oct 2022 7:30 AM GMTఆ శృంగారం కార్యం కోసం పెళ్లికి ముందు యువతీ యువకులు ఎంతో ఆరాటపడుతారు. ఫస్ట్ నైట్ రోజున కిక్కుకోసం తపనపడుతారు. పెళ్లైన కొత్తలో ఏ జంటకు అయినా శృంగార జీవితం అద్భుతంగా ఉంటుంది. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వయసు పైబడే కొద్దీ సమస్యలు, వయసు భారంతో శృంగార జీవితానికి దూరం అవుతారు. 30 ఏళ్లు దాటాక సెక్స్ పై ఆసక్తి చూపడం లేదని తాజా సర్వేలో తేలింది.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడిట్ లో తాజాగా విశ్లేషణలో కొంతమంది రెడిట్ వినియోగదారులు సెక్స్ జీవితాన్ని ఎలా కోల్పోతున్నారో తమ అభిప్రాయాలు వెల్లడించారు. శృంగారం ఒక పనిలా భావిస్తున్నారని.. దానికి టైం కేటాయించలేకపోతున్నారని.. ఎక్కువ పనిగా చెబుతున్నారంటూ ఒక మహిళ తన భర్త తీరుపై ఆవేదన చెందింది. కొన్నేళ్లకు ముందులా నేడు సెక్స్ లో పాల్గొనడం లేదని కొన్ని వృద్ధ జంటలు ఆవేదన చెందుతున్నాయి. ఇక్కడ 20లు లేదా 30ల వయసులో ఉన్న యువత ఈ చర్చలు పెడుతున్నారు.
పిల్లల్ని కనడం లేదా పెళ్లి చేసుకోవడంతో సెక్స్ జీవితం ముగిసిపోతుందని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం కోరికలు తక్కువుండే తమ భర్తలు గంటల పాటు పోర్న్ చూస్తారని.. వారు పక్కన ఉండేటప్పుడు కనీసం తమకు కూడా కోరికలు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డెడ్ బెడ్ రూమ్స్ గ్రూపులో మిలియనల్స్ చెప్పుకుంటున్న బాధల జాబితా చాలా పెద్దగా కనిపిస్తోంది. మిలియనీల్స్ సెక్స్ లో చురుకుగా పాల్గొనే దశలో ఉంటారు. కానీ ఇప్పటికే సెక్స్ కు గుడ్ బై చెబుతున్నట్లు చాలా మంది వెల్లడిస్తున్నారు.
2021లో అమెరికాలోని ఇండియా యూనివర్సిటీకి చెందిన కిన్సీ ఇన్ స్టిట్యూట్ ఒక అధ్యయనం నిర్వహించింది. దీనిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారు పాల్గొన్నారు. అయితే పెళ్లైనవారిలో ముఖ్యంగా మిలినియల్స్ కోరికలు తగ్గిపోవడం అనే సమస్య ఎక్కువైందని తేలింది.
పెళ్లి చేసుకున్న 25.8 శాతం మంది మిలీనియల్స్ ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడించారు. వారి తర్వాత జన్మించిన జెనరేషన్ జడ్ లో ఈ సమస్య 10.5 శాతం ఉండగా.. జనరేషన్ ఎక్స్ లో ఇది 21.2శాతంగా ఉంది. వైవాహిక జీవితంలో సెక్స్ లేకపోవడానికి ప్రధాన కారణం ఈ కోరికలు తగ్గిపోవడమేనని తేలింది. ఇంటర్నెట్ వల్ల తమ జీవితాలపై పడుతున్న ప్రభావంలో దీనికి పెద్ద పాత్ర ఉందని అంటున్నారు. అదే సమయంలో మందుతరం ఎదుర్కోని వింత సవాళ్లు వీరి సెక్స్ జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు తేల్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.