Begin typing your search above and press return to search.
కోర్టులో పోలీసులుః బీకాంలో ఫిజిక్స్ ఉన్నప్పుడు.. ఎలుకలు మద్యం తాగలేవా యువరానర్..?
By: Tupaki Desk | 11 March 2021 2:30 AM GMTఎలుకలు పేపర్లు కొట్టడం.. దుస్తులు కొరకడం.. మానేశాయట! తరతరాలుగా, యుగయుగాలుగా అవే తిని వాటికి బోర్ కొట్టిందట! అందుకే.. కొత్తగా మద్యం ట్రై చేశాయట! అంతే.. కామటరాయుడు సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పినట్టు చీకటైతే చాలు సుక్క కోసం జివ్వు జివ్వు మంటూ ఉరికేసియనట. ఇట్లా తాగుడుకు మరిగిన తాగుబోతు ఎలుకలు.. సీసా మీద సీసా పీకేశాయట! అందరి వాడు సినిమాలో అన్నయ్య చిరంజీవి మందు బాటిల్ మీదకు ఎక్కేసిన ఎలుకగారిలా.. ర్యాట్స్ అన్నీ దొంగ క్యాట్స్ గా మారిపోయి మందు మొత్తం మింగేశాయట!
ఏంటీ.. ఎలుకలు మందు తాగాయా? అని అడుగున్నారా..? కోర్టులో జడ్జిగారు కూడా ఇలాగే అడగారు..! దానికి బోనులోకి వచ్చిన పోలీసులు.. అంతా నిజమే చెబుతామని, అబద్దం చెప్పమని మనస్సాక్షిమీద ప్రమాణం చేసి మళ్లీ ఇదే చెప్పేశారు. ''ఎలుకలు మద్యం తాగాయి యువరానర్'' అని! ఇదంతా జరిగింది ఎక్కడంటే హర్యానాలో!
ఆ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం మద్యం అక్రమ అమ్మకాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 50 వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాటిళ్లను ఆయా ప్రాంతాల్లోని 30 పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీటికి సంబంధించి 825 నిందితులపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. అయితే.. కోర్టుకు లెక్క చెప్పాల్సి వచ్చే సరికి 25 పోలీస్ స్టేషన్లలో దాచిన మద్యం సీసాల్లో మందు మాయమైయింది.
కారణం ఏంటని జడ్జి అడిగితే.. ఎలుకలు తాగేశాయని చెప్పారట. అయితే.. ఇక్కడో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఆ ఎలుకలు చీప్ లిక్కర్ బాటిళ్లను ముట్టుకోలేదు. కేవలం ఖరీదైన బాటిళ్లలోని మందు మాత్రమే తాగేశాయట! నిజంగా.. భలే ఎలుకలు కదా.. కేవలం కాస్ట్ లీ మందుకు మాత్రమే భలేగా మరిగాయి! ఇదంతా ట్రాష్.. ఏదో గోల్ మాల్ జరిగి ఉంటుందని అనుకుంటున్నారా..? ఈ మాట అంటే.. ఆ పోలీసులు ఖచ్చితంగా.. బీకాంలో ఫిజిక్స్ ఉన్నప్పుడు.. ఎలుకలు మందు తాగకూడదా చెప్పండని అడుగుతారేమోనని డౌటనుమానం.