Begin typing your search above and press return to search.
షాకులతో సీనియర్లు డిఫెన్సులో పడ్డారా?
By: Tupaki Desk | 30 Aug 2020 1:30 PM GMTఅమ్మకు అండగా.. అబ్బాయికి అంటీముట్టనట్లుగా వ్యవహరించే కాంగ్రెస్ సీనియర్లకు ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. తాము రాసిన లేఖతో యువరాజును దారికి తెచ్చుకోవచ్చన్న ప్లాన్ తలకిందులు కావటమే కాదు.. మిస్ ఫైర్ అయి.. అందరూ తిట్టేస్తున్న పరిస్థితిని వారు ఏ మాత్రం ఊహించలేదు. ఎందుకిలా? అంటే.. లేఖ రాసిన వారిలో ఏ ఒక్కరు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన నేతలు కాదు. పార్టీ అండతో పెరిగి.. పదవులు పొందిన వారంతా. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రీతిలో ఉండటంలో వారి వాటాను ఎవరూ విస్మరించలేదు.
అలాంటి వారు.. పార్టీ విధానాల్ని విమర్శించటమే కాదు.. అసలు పార్టీ ఎలా ఉండాలి? పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు ఏమిటన్న విషయాన్ని వివరించిన తీరు కాంగ్రెస్ నేతలకు కాలిపోయేలా చేసింది. 23 మంది నేతలు లేఖాస్త్రాన్ని గాంధీ కుటుంబానికి సంధిస్తే.. మరో 23 మంది కూడా వారికి తోడు కాకపోగా.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్న తీరుతో సదరు నేతలకు తల వాచిపోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన గులాం నబీ అజాద్ మీడియా ముందుకు వచ్చి లేఖ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
లేఖ రాసినందుకు తామేమీ ఆత్మరక్షణలో పడలేదని.. అందులో తాము రాసిన వాటికి కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. చాలా కీలకాంశాల్ని లేవనెత్తామని.. ఎక్కడా గాంధీలను విమర్శించలేదని.. వారి సేవల్ని తాము కొడియాడినట్లుగా పేర్కొన్నారు. సంస్కరణల అవసరాల్ని తాము చెప్పామే తప్పించి.. తమదే పాపం లేదన్నట్లుగా వారి మాటల్ని వింటే విషయం ఇట్టే అర్థం కాక మానదు.
వర్కింగ్ కమిటీ సమావేశంలో తమను కొందరు ద్రోహులుగా చిత్రీకరించటం దారుణమన్న మాటకు తెగ బాధ పడిపోయారు. సమావేశంలో తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. జైచంద్ తో పోల్చటాన్ని వారు జీర్ణించుకోలేనట్లుగా చెప్పారు. ఇంతకీ ఈ జైచంద్ ఎవరో కాదు పృథ్వీరాజ్ చౌహాన్ కు వ్యతిరేకంగా విదేశీ శక్తులతో చేతులు కలిపిన ద్రోహి. అలాంటి వారితో తమను పోల్చటాన్ని వారు అస్సలు ఊహించలేనట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి.
గాంధీ ఫ్యామిలీని తాము పల్లెత్తు మాట అనలేదన్న మాటతోనే.. వారి తాజా పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. తాము రాసిన లేఖను తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా లేఖలో సంతకాలు పెట్టిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక అజాద్.. ఒక శశిథరూర్.. ఒక కపిల్ సిబల్.. లాంటి వారికి నిజంగా పార్టీని బాగు చేయాలన్న అంత తపనే ఉంటే.. సోనియమ్మను టైం అడిగితే ఇవ్వరా? ఆమెతో సమావేశమై.. తాము సిద్ధం చేసిన అంశాల్ని చర్చించే స్వతంత్రత లేదా? అలాంటి అవకాశాల్ని వదిలేసి.. పార్టీని రోడ్డు మీదకు తీసుకురావటాన్ని ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అందుకే.. లేఖ రాసిన సీనియర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఇలాంటి వ్యతిరేకతను ఊహించని వారు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడినట్లుగా వారి వ్యాఖ్యల్ని చూస్తే.. అర్థం కాక మానదు.