Begin typing your search above and press return to search.

రూ.10వేలు రాని వాళ్లు ఇలా చేయండి ..సీఎం జగన్

By:  Tupaki Desk   |   10 Jun 2020 12:10 PM GMT
రూ.10వేలు రాని వాళ్లు ఇలా చేయండి ..సీఎం జగన్
X
ఏపీ సరైన రాజధాని కూడా లేని రాష్ట్రం ..లోటు బడ్జెట్ రాష్ట్రం ..అయినప్పటికీ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ద్యేయంగా పలు రకాల పథకాలకు శ్రీకారం చుడుతూ ..ఈ వైరస్ కష్టకాలంలో కూడా ప్రజలకి అండగా ఉంటున్నారు. తాజాగా నేడు (బుధవారం) జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌ (దర్జీ) లకు రూ.10వేలు జమ చేయనున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌ (దర్జీ)లకు ఇచ్చిన నిలబెట్టుకున్నాను అన్నారు సీఎం జగన్. అలాగే, ఎవరైనా అర్హులు ఉండి,

ఈ పథకం అమలుకానీ వారికీ మరో అవకాశం కల్పించారు సీఎం జగన్. అర్హత ఉన్నవాళ్లు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లి అర్హతలు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి మరో నెల రోజులు గడువు ఇస్తున్నట్టు తెలిపారు.

వారికి వచ్చే నెలలో డబ్బు జమ చేస్తారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా, అర్హత ఉంటే పథకం అందుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌ లతో మాట్లాడారు.. లబ్దిదారుల అన్ ‌ఇన్‌ కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు.