Begin typing your search above and press return to search.

ఆన్ ఫాలో చేయండి..: కేటీఆర్

By:  Tupaki Desk   |   1 April 2022 9:09 AM GMT
ఆన్ ఫాలో చేయండి..: కేటీఆర్
X
'నేను పెట్టే పోస్టులు మీకు నచ్చకపోతే మీరు అన్ ఫాలో చేయండి.. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎప్పటికీ ఎండగడుతూనే ఉంటాం' అంటే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గత కొన్ని నెలలుగా కేంద్రం వర్సెస్ తెలంగాణ అన్నట్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. దీంతో కేంద్రం తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు.

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరపై టీఆర్ఎస్ వరుసగా ఆందోళనలు చేస్తోంది. మోడీ పాలనలోనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తోంది.అయితే బీజేపీ నాయకులు సైతం రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచారని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కొందరు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తుండగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియా బీజేపీ స్ట్రాంగ్ ఉంది. దీంతో టీఆర్ఎస్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు సైతం ప్రతిగా బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విషయం తెలిసిందే. ఆయన ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అవుతూ పలు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. ఇదే తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. లెటేస్టుగా కమర్షియల్ ఎల్పీజీ ధరను ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఓపోస్టును పెట్టారు. దీనికి ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని పేర్కొంటూ 'అచ్చేదిన్ ఏప్రిల్ పూల్స్ డేస్' అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.

అయితే ఈ ట్వీట్ పై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. బీజేపీ దాడితో టీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే 'నేను ఇచ్చిన రిప్లై మీకు నచ్చకపోతే నన్ను ఫాలో అవడం మానేయండి..' అంటూ కౌంటర్ వేశారు. దీంతో ట్విట్టర్ వేదికంగా రాజకీయ వేడి సంతరించుకుంది. అయితే కొద్ది రోజులుగా రకరకాల పోస్టులతో కేటీఆర్ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.