Begin typing your search above and press return to search.
చైనా సైబర్ దాడిని అడ్డుకునే టెక్నాలజీ మనకు ఉందా..? మన ముందున్న మార్గాలు ఏంటీ?
By: Tupaki Desk | 14 April 2021 12:30 AM GMTఒకప్పుడు దేశాల మద్య యుద్దాలు అంటే బాంబులు.. తుపాకులను ఉపయోగించే వారు. కాని ఇప్పుడు శత్రు దేశాలను నాశనం చేసేందుకు టెక్నాలజీని వాడుతున్నారు. శత్రు దేశం యొక్క ముఖ్యమైన సమాచారంను చోరీ చేయడం దానిని ఉపయోగించి సమయం చూసుకుని సైబర్ దాడి చేయడం ఇప్పుడు కొన్ని దేశాలు అవలంభిస్తున్న యుద్ద విధానం. సైబర్ దాడులతో మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలు తల కిందులు అవ్వడంతో పాటు ఎన్నో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఇండియాపై సైబర్ దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్టోబర్ 12వ తారీకున ముంబయి మొత్తం అంధకారంలోకి వెళ్లి పోయింది. గతంలో ఎప్పుడు జరగని ఆ సంఘటనను మొదట అంతా యాక్సిడెంట్ అనుకున్నారు. టెక్నికల్ లోపం లేదా మరేదో సమస్య అనుకున్నారు. కాని ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్థారించిన విషయం ఏంటీ అంటే ఇది చైనా సైబర్ డిపార్ట్ మెంట్ చేసిన పని అని.. వారు ముంబయిని స్థంభింపజేశారని వారు పేర్కొంటున్నారు.
విద్యుత్ గ్రిడ్ కు సంబంధించిన టెక్రాలజీని హ్యాక్ చేసి వారు చేసిన రాక్షస క్రీడలో భాగంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. సైబర్ దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఆ దేశ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ దాడి విషయం పక్కన పెడితే ఇండియాపై సైబర్ దాడి చేయగల సత్తా చైనాకు ఉంది. ఇండియా మొత్తంను తమ సైబర్ దాడితో స్థంభింపజేయగల సత్తా కూడా చైనా వారికి ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో సైబర్ నేరగాళ్లు ఒక ఆర్మీగా పని చేస్తున్నారట. ఇండియాతో పాటు పలు దేశాలకు సంబంధించిన సమాచారంను వారు సేకరించడంతో పాటు ఎప్పుడు అంటే అప్పుడు సైబర్ దాడికి సిద్దంగా ఉన్నారట. చైనా సైబర్ ఆర్మీ చేసే పని ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెర తీసే విధంగా ఉంటుందని అంటున్నారు. చైనా కనుక సైబర్ దాడి చేయాలని నిర్ణయించుకుంటే దాని శత్రుదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. అయితే చైనా ఆ పని చేయక పోవడంకు కారణం ఏ ఒక్క దేశంపై ఆ చైనా సైబర్ దాడి చేసినట్లుగా అధికారికంగా వెళ్లడి అయినా కూడా చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అందుకే చైనా ఆచితూచి వ్యవహరిస్తుందని అంటున్నారు.
చైనా సైబర్ నేరగాళ్లకు ప్రధానంగా మనం వాడుతున్న వస్తువులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులే టార్గెట్. ఇండియాలో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఏ రేంజ్ లో ఉందో చెప్పనక్కర్లేదు. మొబైల్ ఫోన్ ల నుండి ల్యాప్ టాప్ ల వరకు ఏసీల నుండి బాత్ రూమ్ ల ట్యాప్ ల వరకు ఎన్నో చైనా వస్తువులు ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ను కలిగి ఉంది. ఆ కారణంగానే ఇండియాకు చెందిన డేటా మొత్తం ఇప్పుడు చైనా చేతిలో ఉందని అంటున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇండియా పై మరింతగా దాడికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇండియాలో జరిగే సైబర్ నేరాలకు ప్రధానంగా చైనీయులే కారణంగా ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ప్రతి ఏడాది కొన్ని వేల మంది సైబర్ నేరగాళ్లు తయారు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా పూర్తిగా చైనా వస్తువులను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి చైనా వస్తువు లేదా ఎలక్ట్రానిక్ వస్తువు పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన డేటా మొత్తం తీసుకు వెళ్లి చైనాలో భద్రపర్చినట్లే. దాని ద్వారా వారు ఏ సమయంలోనే అయినా దాడి చేసే అవకాశం ఉంది. సైబర్ దాడులను ఆపడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.