Begin typing your search above and press return to search.
దావోస్ అంటే వైసీపీకి ఆయనే గుర్తుకొస్తున్నారా...లేకపోతే...?
By: Tupaki Desk | 17 Jan 2023 4:13 PM GMTదావోస్ అంటే మాత్రం చంద్రబాబే గుర్తుకు వస్తారు. ఆ విషయం నిజం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు విభజన ఏపీకి సీఎం గా ఉన్నారు. ఆయన ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా దావోస్ టూర్ చేసేవారు. తన వెంట పెద్ద సంఖ్యలో మంత్రులు అధికారులను సైతం వెంటబెట్టుకుని బాబు అటెండ్ అయ్యేవారు. దావోస్ టూర్ గురించి తెలుగుదేశం మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చేది.
దావోస్ టూర్ వల్ల నిజానికి ప్రపంచ పెట్టుబడులన్నీ ఒకే వేదిక మీదకు వస్తాయి. చెప్పాలనుకుంది చెప్పవచ్చు. ఒక రకంగా అది ఏపీ ప్రమోషన్ స్పాట్ గా చూడాలి. మరి అలాంటి గోల్డెన్ చాన్స్ ని తెలుగుదేశం వాడుకున్నట్లుగా వైసీపీ ఎందుకు వాడుకోవడం లేదు అన్నదే ఒక చర్చ.
దావోస్ వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాధ్ కొట్టిపారేస్తున్నారు. కానీ దావోస్ టూర్ కి తెలంగాణా ఐటీ మంత్రి కేటీయార్ ఎందుకు అటెండ్ అవుతున్నారు. పక్కన ఉన్న కర్నాటక ప్రభుత్వం ఎందుకు వెళ్తోంది. యూపీ సర్కార్ ఎందుకు పోతోంది. ఇవన్నీ ప్రశ్నలే. అంటే వారికి కూడా దావోస్ కి వెళ్ళడం వల్ల ఏమీ కాదని తెలియడంలేదా.
నిజానికి దావోస్ సదస్సులు వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు జరగలేదు. కరోనా ప్రభావంతో ప్రపంచం ఆగిపోయింది అపుడు. అందువల్ల ఎవరూ వెళ్లలేదు. ఇలా వైసీపీకి విలువైన అవకాశాలు లేకుండా పోయాయి. కానీ వైసీపీ గత ఏడాది మాత్రం ఒకే ఒకసారి అటెండ్ అయింది. సీఎం జగన్ సహా అంతా వెళ్ళారు. మరి పెట్టుబడులు ఏవీ కొత్తగా వచ్చాయా లేదా అన్న ప్రశ్నలు ఉన్నా మంచి ప్రయత్నం అని అంతా సంతోషించారు.
కానీ ఇపుడు వరల్డ్ ఎకానామిక్ ఫోరం కి వైసీపీ డుమ్మా కొట్టింది. అపుడు వెళ్లిన కేటీయార్ ఇపుడు కూడా మళ్ళీ వెళ్ళారు. దాంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. దావోస్ ఎందుకు వెళ్లలేదు అంటూ తెలుగుదేశం నాయకుడు బోండా ఉమ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి మంత్రి గుడివాడ అమరనాధ్ జవాబు చెప్పే ప్రయత్నం చేస్తూనే తెలుగుదేశం మీద ఎదురుదాడికి దిగడం విడ్డూరంగా ఉంది అంటున్నారు.
దావోస్ నుంచి తమకు పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం వచ్చిందని, కానీ తామే వెళ్లలేదు అని గుడివాడ బదులించారు. ఇక విశాఖలో పెట్టుబడుల సదస్సుని తామే నిర్వహిస్తున్నాం కాబట్టి వెళ్లలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. అది బాగానే ఉంది కానీ దావోస్ కి కూడా వెళ్తే పోయేది ఏముంది. తెలంగాణా ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో పెట్టుబడుల సదస్సులు పెడుతూ ఉంటుంది కదా. అది ఒక ఎత్తు దావోస్ వెళ్లి రావడం మరో ఎత్తు అని అంటున్నారు అంతా.
ఇక తెలుగుదేశం అయిదేళ్ల పాలనలో దావోస్ వెళ్ళి వచ్చింది కదా ఏమి సాధించింది అని మంత్రి గుడివాడ అంటున్నారు. సాధించినా లేకపోయినా ప్రయత్నం అక్కడ కనిపించింది. మీరు అదే చేయండి అని జనాలే అంటున్నారు కదా. దావోస్ వెళ్లి వచ్చాక పెట్టుబడులు ఎన్ని అని అడిగితే అడగవచ్చు రాకపోతే పోవచ్చు కానీ ప్రభుత్వం పారిశ్రామిక రంగం మీద స్పెషల్ ఫోకస్ పెడుతోంది అన్న పేరు అయినా వచ్చేది కదా అని అంటున్నారు.
చూడబోతే దావోస్ అని పలుమార్లు చంద్రబాబు వల్లించారు కాబట్టి దావోస్ అంటే వైసీపీకి వ్యతిరేకం అయిందా అని అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఏ విధంగా యాంటీ థాట్స్ తో ఉన్నారో దావోస్ విషయంలోనూ అలాగే ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా తటస్థ వర్గం నుంచి వస్తున్నాయి. ప్రగతి విషయంలో వ్యక్తులు రాజకీయాలు ప్రధానం కాదు, మరి వైసీపీ మాత్రం బాబు ఫోబియా తో ఉంటోంది. అన్నీ అలాగే చూస్తోంది, అందుకే దావోస్ కి డుమ్మా అని తమ్ముళ్ళు సహా అంతా అంటున్నారు అంటే వైసీపీ ఆలోచించాల్సిందేగా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.