Begin typing your search above and press return to search.
ఆ విషయంలో కొడాలి నాని సతమతమవుతున్నారా?
By: Tupaki Desk | 26 Sep 2022 10:34 AM GMTఏపీ రాజకీయాల్లో కొడాలి నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఎవరైనా ఏమంటే చాలు.. వెంటనే నాని ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తారు. అలాంటి నాని గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు రాకపోవడంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ప్రస్తుతం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడంపై అన్ని పార్టీలు, సంఘాలు, తటస్థ వ్యక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా జగన్ నిర్ణయం సరికాదని ఆయన సోదరి వైఎస్ షర్మిల సైతం చెప్పారు. ఇక అధికార భాషా సంఘం చైర్మన్‌గా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటివారు అయితే వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాజీనామా కూడా చేశారు.
అయితే ఈ వ్యవహారంలో ఇంతవరకు గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించకపోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి వీర విధేయుడు.. కొడాలి నాని. అలాంటిది యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై ఎందుకు స్పందించలేదని ఆరా తీస్తున్నారు.
అయితే ఈ నిర్ణయంపై కొడాలి నాని సతమతమవుతున్నారని చెప్పుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తే సొంత సామాజికవర్గంలోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ తనపై విమర్శలు వస్తాయని నాని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఈ విషయంపైన స్పందించకుండా ఉన్న ఇవే విమర్శలు తప్పవని కొడాలి నాని భావిస్తున్నారని గుడివాడ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్ర విమర్శలతో తనపై సొంత సామాజికవర్గంలోనే అసంతృప్తి ఉందని నాని భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. యూనివర్సిటీకి పేరు మార్చకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం నానికి ఉందని అంటున్నారు. 25 ఏళ్లుగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉంది కాబట్టి దాన్నే కొనసాగిస్తే ఇప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని నాని భావనగా ఉందని చెబుతున్నారు.
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా ఎన్టీఆర్ అభిమానుల మనసులు గెలుచుకున్నామని.. అయితే యూనివర్సిటీ పేరు మార్చి అదంతా పోగొట్టుకున్నామనే అభిప్రాయం నానిలో ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఆ నిర్ణయంపై నాని స్పందించలేదని చెప్పుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.