Begin typing your search above and press return to search.
జగన్ మీదే నమ్మకమా...అందుకే బాబుతో పవన్...?
By: Tupaki Desk | 22 Oct 2022 4:30 PM GMTరాజకీయాల్లో అనుమానాలు వేరు. అవి కలసి కూర్చుకుని మాట్లాడుకుంటే సర్దుకుంటే పోతాయి. కానీ నిజంగా జరుగుతున్నాయని సంకేతాలు వస్తే మాత్రం ఇక వాటి మీద సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిందే. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇపుడు చూస్తే ఏపీలో చోటు చేసుకున్న కీలక పరిణామం జనసేన టీడీపీ పొత్తుకు దగ్గర కావడం. అయితే ఈ పరిస్థితులు ఏర్పడడానికి ఇంకా టైం ఉండేదేమో కానీ విశాఖలో పోలీసులు జనసేనాని మీద చూపించిన అతి ఉత్సాహం వల్లనే ఇలా జరిగింది అంటున్నారు.
లేకపోతే 2024 మొదటి వరకూ పొత్తుల విషయంలో కానీ టీడీపీ వైపు వెళ్ళే ఆలోచన కానీ పవన్ చేసి ఉండేవారు కాదని అంటున్నారు. ఒక దశలో పవన్ ఒంటరి పోరునకు రెడీ అయ్యారని చెబుతారు. ఇదిలా ఉంటే కేంద్రంలోని బీజేపీ ఏపీలోని మిత్రపక్షం జనసేన కంటే వైసీపీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది అని అనేక పరిణామాలు తెలియచేస్తున్నాయి అని అంటున్నారు. ఏపీలో జగన్ కే జనాలలో మద్దతు ఉందని వచ్చే ఎన్నికల్లో మరోమారు జగన్ గెలుస్తారు అన్న అంచనాల్లో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.
ఇక 2024 ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. కచ్చితంగా బీజేపీకి ఇపుడు ఉన్న 304 సీట్లు అయితే దక్కవు. సాధారణ మెజారిటీ అంటే 273 సీట్లు అయినా లభిస్తాయా అంటే అది కూడా డౌటే అంటున్నారు. దాంతో బీజేపీ మిత్రుల మీద ఆధారపడక తప్పని సీన్ ఉంది. ఇక ఏపీలో చూసుకుంటే వైసీపీ బీజేపీకి అనధికార మిత్రుడుగానే చూస్తున్నారు. ఎంతకాదనుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీకే జనాలు మరోమారు పట్టం కడతారు అని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారు అనే అంటున్నారు.
దాంతో పాటు 15 కి తగ్గకుండా ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలో పడతాయని లెక్కలేసుకుంటున్నారులా ఉంది. అందుకే వైసీపీ విషయంలోనే మొగ్గు చూపిస్తున్నారు అని చెబుతున్నారు. ఈ మధ్య విశాఖ ఘటన మీద పవన్ విజయవాడ వచ్చి ఏకంగా గవర్నర్ ని కలసి వైసీపీ ప్రభుత్వ దాష్టికాలను వివరించాలనుకున్నారు. అయితే గవర్నర్ నుంచి ఆయనకు అపాయింట్మెంట్ రాలేదు. దానికి ఆయన చాలా బాధపడ్డారని అంటున్నారు. గవర్నర్ పూర్వాశ్రమంలో బీజేపీకి చెందిన వారే. పైగా బీజేపీ వారు తలచుకుంటే కచ్చితంగా గవర్నర్ అపాయింట్మెంట్ పవన్ కి దక్కి ఉండేది అని అంటున్నారు.
కానీ ఆ మాత్రం సాయానికి కూడా బీజేపీ వారు ముందుకు రాలేదని మధనపడిన మీదటనే ఆయన బీజేపీతో దూరం పాటించాలనుకున్నారని అంటున్నారు. అందుకే ఆయన చంద్రబాబుతో భేటీకి వెంటనే సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని దూరం పెట్టి టీడీపీ జనసేన పోటీ చేయాలని మాత్రమే పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇక మరో వైపు చూస్తే బీజేపీ ఆలోచనలు పూర్తిగా వారి భవిష్యత్తుని ఏపీలో దృష్టిలో పెట్టుకుని ఉన్నాయనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ గెలవాలి. ఆ విధంగా జరిగితే కచ్చితంగా తెలుగుదేశం రాజకీయంగా ఇబ్బందులలో పడుతుంది. ఈసారి టీడీపీని మరింతంగా నిర్వీర్యం చేసేందుకు జగన్ చూస్తారు. ఆయనకు ఆ విధంగా సాయం చేసేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉంటుంది అంటున్నారు.
టీడీపీ ఒకసారి రాజకీయంగా వెనక్కి వెళ్తే ఆ స్పేస్ లోకి బీజేపీ వచ్చి అపుడు వైసీపీ మీద రాజకీయ సమరం చేయడానికి చూస్తుంది అంటున్నారు. ఈ లోగా జగన్ తో మంచిగా ఉంటే 2024లో వైసీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ మూడవసారి ఏర్పాటు కావడానికి ఉపయోగపడతారు. ఆ విధంగా ఏపీలో 2029 టార్గెట్ ని కేంద్రంలో 2024 టార్గెట్ ని పెట్టుకునే బీజేపీ తన రాజకీయం తాను చేస్తోంది అంటున్నారు.
ఇక పవన్ రాజకీయం కూడా 2024 ఎన్నికల తరువాత ఏమిటన్నది తేలుతుంది అని అప్పటిదాకా వేచి చూసే ధోరణిలోనే ఉండాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఉంది అంటున్నారు. మొత్తానికి టీడీపీ చంద్రబాబు విషయంలో మోడీ అమిత్ షా జగన్ ఒక్క మాట మీద ఉన్నారనే అంటున్నారు. అందుకే ఏపీలో జనసేన తన రూట్ మార్చుకోవాల్సి వచ్చింది అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ సరికొత్త రాజకీయ పరిణామాలు ఏపీని ఏ తీరం వైపు తిప్పుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.