Begin typing your search above and press return to search.
అత్యాచారం చేసిన వారికి సన్మానాలు చేస్తారా? కేంద్రంపై సుప్రీం ఫైర్
By: Tupaki Desk | 25 Aug 2022 2:44 PM GMTఅత్యాచారం చేసిన వారిని.. విడుదల చేస్తారా...? వారు దేశానికి సేవ చేసిన స్వాతంత్య్ర సమర యోధుల మాదిరిగా.. సన్మానాలు చేస్తారా? అని సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. ఇలా చేయడానికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు చెప్పాలంటూ.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సీపీఎం నేత సుభాషిణి అలీ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, మరొకరు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగినట్లు రుజువైంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
వీరిని విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం స్పందిస్తూ, దోషులను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడంలో వివేకాన్ని ఉపయోగించారా? లేదా? అనే విషయాన్ని తాము పరిశీలిస్తామని చెప్పింది.
వారిని విడుదల చేయాలని ఈ న్యాయస్థానం ఆదేశించలేదని, విధానం ప్రకారం శిక్ష తగ్గింపు గురించి పరిశీలించాలని మాత్రమే చెప్పిందని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినవారికే శిక్ష తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఈ కేసులో 11 మంది దోషులు 15 సంవత్సరాలపాటు శిక్షను అనుభవించారు.
స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వీరిని గుజరాత్ ప్రభుత్వం రిమీషన్ పాలసీ ప్రకారం విడుదల చేసింది. వీరు విడుదలైన తర్వాత వీరికి లభించిన స్వాగత సత్కారాలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ పరిణామాలను సుప్రీం సీరియస్‌గా తీసుకోవడం గమనార్హం.