Begin typing your search above and press return to search.
మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే కరోనా వైరస్ ఉన్నట్లే!
By: Tupaki Desk | 11 April 2021 3:29 AM GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వైరస్ రెండో దశ గుప్పిట్లో దేశం అల్లాడుతోంది. అందుకే అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మరికొన్నాళ్లు ఈ డేంజర్ బెల్స్ మోగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ప్రమాద స్థాయిలో ఉన్నామని అంచనా వేస్తున్నారు. కాగా వైరస ఎటునుంచి, ఎవరి నుంచి సంక్రమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలామంది పరీక్షలు చేయించుకోకుండానే ఉంటున్నారు.
కొందరిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. సాధారణ జలుబులాగా వచ్చి అదే నయం అవుతోంది. అయితే కొన్ని లక్షణాలను బట్టి వైరస్ ను నిర్ధారణ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ శరీరంలో ఉన్నప్పుడు కళ్లు ఎర్రగా మారడం, కండ్ల కలక వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని కంటి నిపుణులు వెల్లడించారు. ఇటీవల నమోదైన కేసుల్లో ఈ లక్షణాలను గుర్తించినట్లు తెలిపారు. జ్వరంతో పాటు ఈ సమస్య ఉన్నట్లైతే కరోనా ఉన్నట్లేనని అంటున్నారు.
వైరస్ మెదడుపై ప్రభావం చూపుతోందని మానసిక నిపుణుల అధ్యయనాల్లో వెల్లడైంది. జ్ఞాపక శక్తి మందగించడం, సాధారణ పనులను చేసుకోలేకపోవడం, గందరగోళం, అసమతుల్యత, దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నివేదికల్లో పొందుపర్చారు. అకారణంగా ఏకాగ్రత లోపం సమస్యలు వస్తే అదే కొవిడ్ కు కారణమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జలుబు, దగ్గు వంటి లక్షణాలు కరోనా తొలి కేసుల నుంచే కనిపిస్తున్నాయి. వైరస్ ప్రధానంగా శ్వాసకోశంపై ప్రభావం చూపుతోందని అందుకే ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. వైరస్ కారణంగా సాధారణ పొడి దగ్గు అసాధారణంగా మారుతుంది. ఇది గొంతుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. చాలా రోజులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దగ్గు ద్వారా వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరిస్తున్నారు.
శరీర ఉష్ణ్రోగతలో తరుచూ మార్పులు ఉంటే వైరస్ ఉన్నట్లేనని అంటున్నారు. ఉష్ణ్రోగ్రత పెరుగుతూ, ఒక్కోసారి తగ్గుతూ చలి, వణుకును కలిగి ఉంటుందని అంటున్నారు. శ్వాసతీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. దడ, వేగంగా ఊపిరి తీసుకోవడం వంటి లక్షణాలు అకస్మాత్తుగా జరుగుతాయని అంటున్నారు. అతిసారం, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటే కరోనా కారణం అయి ఉండొచ్చు. జీర్ణాశయంపై ప్రభావం చూపి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అకారణంగా అలసట, నీరసం వంటివి ఉంటాయని చెబుతున్నారు. అసౌకర్యాంగా ఉంటూ శరీర నొప్పులు ఉంటాయని తెలిపారు. పై లక్షణాలు ఉంటే వైరస్ శరీరంలో ఉన్నట్లేనని.. నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే స్పష్టమవుతుందని వివరించారు.