Begin typing your search above and press return to search.
‘పబ్జీ జంట’ ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?
By: Tupaki Desk | 23 Jun 2021 1:30 AM GMTపబ్జీ గేమ్ ఆడుతూ.. మహిళలు, చిన్నారులతో అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ.. ఆ ఆడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన తమిళనాడు జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది చూసి పోలీసులే విస్తు పోతున్నారట.
తమిళనాడుకు చెందిన పబ్జీ మదన్, ఆయన భార్య కృత్తిక కలిసి మూడేళ్లకుపైగానే ఈ దందా కొనసాగిస్తున్నారట. వీరి బ్యాంక్ అకౌట్లను పరిశీలించగా.. దాదాపు రూ.4 కోట్ల పైనే ఉన్నాయట! ఇంత మొత్తం చూసి విచారణ అధికారులు నోరెళ్ల బెట్టారట.
గడిచిన మూడేళ్లలో వీరు ఏకంగా రూ.75 కోట్ల మేర సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలోనూ అవకతవకలకు పాల్పడినట్టు తేలినట్టు సమాచారం. దీంతో.. పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
అయితే.. ఇంత మొత్తం కేవలం బూతు ఆడియోలు, వీడియోల ద్వారానే సంపాదించారా? లేక, మరేదైనా అక్రమాలకు పాల్పడ్డారా? అనే విషయమై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే.. అసలు విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.