Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ కొత్త ప్రధానికి ఎంతమంది భార్యలో తెలుసా?

By:  Tupaki Desk   |   13 April 2022 5:36 AM GMT
పాకిస్తాన్ కొత్త ప్రధానికి ఎంతమంది భార్యలో తెలుసా?
X
ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పాకిస్తాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో పాక్ కు 23వ ప్రధానిగా ప్రతిపక్ష నేత షెహబాజ్ ను ఎంపీలందరూ ఎన్నికున్నారు. షెహబాజ్ కు పాక్ అసెంబ్లీ నుంచి పూర్తి మద్దతు లభించింది. దీంతో ఆయన ఎన్నిక సుగమమైంది. మూడు సార్లు పాక్ ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ కు సోదరుడే ఈ షెహబాజ్ ఖాన్. ఆయనపై గతంలో మనీలాండరింగ్ సహా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కేసులు నడుస్తున్నాయి.

అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయారు. ప్రధాని పదవిని కోల్పోయారు. అంతకుముందు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాడు ఇమ్రాన్ . కానీ దాన్ని సుప్రీం కొట్టివేసి అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ఆదేశించింది. ఇందులో ఇమ్రాన్ కు మద్దతు ఇచ్చిన ఎంపీలంతా వ్యతిరేకించడంతో ప్రభుత్వం పడిపోయింది.

షెహబాజ్ షరీఫ్ వయసు 70 ఏళ్లు.పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో పాక్ లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అద్భుతంగా ప్రసంగించడం.. జనాలను ఆకర్షించేలా మాట్లాడగల దిట్ట. విప్లవ కవితలను రాస్తూ వల్లెవేస్తుంటాడు. ఈయన ముగ్గురిని వివాహం చేసుకొని సుఖ పురుషుడిగా పేరుగాంచాడు. రాజవంశానికి చెందిన వీరి కుటుంబానికి భారీగా ఆస్తులున్నాయి.

లండన్, దుబాయ్ లో వీరి కుటుంబానికి లగ్జరీ అపార్ట్ మెంట్లు ఉన్నాయి. భారీగా ఆస్తిపాస్తులున్నాయి. విపక్షాలు, మీడియాలో వీరి అక్రమార్జన గురించి ప్రచారం చేసినా కూడా ఆయనకు ఉన్న ఆదరణ చెక్కు చెదరలేదు.

పాకిస్తాన్ లో కొత్త ప్రధానిగా ఎన్నికైన 70 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఏకపత్నీ వత్రుడు కాదన్న విషయం బయటపడింది. ఆయన ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని వివాహమాడారని సమాచారం.

ఇందులో ఆలియా హనీ, నీలోఫర్ ఖోసా, కుల్సుమ్ హైకి విడాకులు ఇవ్వగా.. మరో ఇద్దరు భార్యలు సుస్రత్, దురానీతో ప్రస్తుతం కలిసి ఉంటుండడం విశేషం. నుస్రత్, షరీఫ్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.ఇక ఆలియా, షరీఫ్ లకు ఒక కూతురు ఉంది.