Begin typing your search above and press return to search.
ఆవు మూత్రం పోసిందని జరిమానా.. ఎంత విధించాడంటే?
By: Tupaki Desk | 4 Dec 2022 12:30 AM GMTమనిషి అంతరిక్షంలోకి వెళుతున్న ఈ సమయంలోనూ ఇంకా పల్లెల్లో మూడనమ్మకాలు పోవడం లేదు. తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలోని ఇల్లందులో తాజాగా ఓ వింత ఘటన విస్తుగొలుపుతోంది. ఇల్లందు పట్టణంలోని రెండో బస్తీలో సుందర్ లాల్ అనే వ్యక్తి ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ బతుకుతున్నాడు. పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలోనే సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుంచి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతుండగా కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జీఎం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుందర్ లాల్ ను పిలిపించి జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామన్నారు.
దీంతో షాక్ తిన్న సుందర్ లాల్ ఎద్దు మూత్రంపోస్తే కేసు పెట్టడం ఏంటిసార్ అంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు. దీంతో కేసు నమోదైందని.. కోర్టుకు వెళ్లి ఫైన్ చెల్లించాలని పోలీసులు తెలిపారు. చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుందర్ లాల్ కు చెప్పారు.
ఎద్దు మూత్రం ఫైన్ కట్టడం ఏంటి సార్ అంటూ సుందర్ లాల్ పోలీసుల ఎదుట సుందర్ లాల్ బాధపడి మెడలో నిరసన ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపాడు. అతడి బాధ చూడలేకపోయిన కోర్టు కానిస్టేబుల్ స్పందించి ‘స్థానిక ఇల్లందు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో అతడికి ఫైన్ చెల్లించి రసీదు ఇచ్చాడు. పోలీసులు సహాయం చేశారని సింగరేణి అధికారులు మాత్రం కేసు పెట్టి ఆందోళనకు గురిచేశారని విమర్శించారు. ఏదైనా ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం చర్చనీయాంశమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.