Begin typing your search above and press return to search.
2020లో ముకేశ్ అంబానీ గంటకు ఎంత సంపాదించారో తెలుసా?
By: Tupaki Desk | 23 Jun 2021 4:31 AM GMT2020 అన్నంతనే అందరికి కరోనాతో కిందామీదా పడిన వైనం గుర్తుకు వస్తుంది. ఇప్పటికైతే మహమ్మారి మీద అంతో ఇంతో అవగాహన ఉంది కానీ 2020లో మాత్రం అంతా కన్ఫ్యూజనే. అసలేం జరుగుతోంది? ఏం జరుగుతుందన్నది తెలీని అయోమయంతో పాటు.. తమ జీవితాల్లో తొలిసారి వింటున్న లాక్ డౌన్ దేశ ప్రజల్ని తెగ ఇబ్బంది పెట్టేసింది. అలాంటి సంవత్సరంలో దేశ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపాదన గంటకు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
తాజాగా విడుదలైన హూరన్ ఇండియా రిచ్ లిస్టులో ఈ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 2020లో ముకేశ్ అంబానీ సంపాదన గంటకు రూ.90 కోట్లుగా తేల్చారు. ఆ ఏడాది ఆయన మొత్తం రూ.2.77 లక్షల కోట్లు సంపాదించినట్లుగా తేల్చారు. ఒక సగటుజీవి తన జీవితకాలం మొత్తంలో కూడా అంబానీ గంట సంపాదనలో పదో వంతు కూడా సంపాదించలేరేమో? అలాంటిది ఆయన మాత్రం గంటకు అంత భారీ మొత్తాన్ని సంపాదించారు.
2020లో అనూహ్యంగా పెరిగిన ఆయన సంపాదనతో ఆయన ఆస్తి ఏకంగా రూ.6.58 లక్షల కోట్లు కావటమే కాదు.. టాప్ టెన్ జాబితాలోకి దూసుకెళ్లారు. మరో భారతీయ కుబేరుడు అదానీ గ్రూప్ ఛైర్మన్ సంపద కూడా భారీగా పెరిగినట్లుగా బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది క్రెడిట్ సూయిజ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నివేదిక. ఇందులో 2020లో భారతీయ కుబేరుల సంపద భారీగా పెరిగినట్లుగా తేల్చింది.
అయితే.. దేశంలోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ మాత్రం తగ్గటం విశేషం. ఎందుకిలా? అంటే రూపాయి విలువ డాలర్ మారకంలో తగ్గిపోవటమే దీనికి కారణమంటున్నారు. రూపాయి విలువ తగ్గిపోవటంతో కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని చెబుతున్నారు. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ ఒక శాతం మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది. 2025 నాటికి భారత్ లో మిలీయనీర్ల సంఖ్య 81.8 శాతం పెరుగుతుందని.. వారి సంఖ్య 13 లక్షలకు చేరుకుంటుందన్న అంచనాను వెల్లడించారు.