Begin typing your search above and press return to search.
4 ఏళ్ల పిల్లలకే ఈ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 31 Aug 2022 10:30 AM GMTఅమ్మఒడిలో ఆటలాడుకునే ఈ చిన్నారులకు ఉద్యోగం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదీకాక జీతం కూడా ఇస్తామనడంతో అందరూ ఆరాతీస్తున్నారు. నాలుగేళ్ల లోపు చిన్నారులకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది ఓ నర్సింగ్ హోమ్.వారికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించింది. జీతం కూడా చెల్లిస్తానని తెలిపింది.
జపాన్ లోని కిటక్యూషులోని ఓ నర్సింగ్ హోమ్ ఒక ప్రకటన చేసింది. అక్కడ ఉంటోన్న వృద్ధులకు కంపెనీ ఇవ్వడానికి, వారి మొహల్లో చిరునవ్వులు పూయించడానికి ఈ చిన్నారులను నియమించుకుంటోంది. ఉద్యోగాలు ఇచ్చే ముందు కాంట్రాక్ట్ కూడా తీసుకుంటుంది.
ఇక ఈ కంపెనీ పలు మినహాయింపులు కూడా ఇచ్చింది. పిల్లల వయసు నాలుగు సంవత్సరాలలోపే ఉండాలి. వారికి ఇష్టమైన సమయంలో నర్సింగ్ హోంకు రావచ్చు. ఆకలి వేసినా.. నిద్రగా అనిపించినా.. వారి మూడ్ ను బట్టి బ్రేక్ తీసుకోవచ్చని తెలిపింది.
80 ఏళ్ల వయసులో ఉన్న 100 మంది వృద్ధులు ఇక్కడ ఉన్నారు. ఇప్పటివరకూ 30 మంది చిన్నారులను ఈ కాంట్రాక్టు కింద తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిన్న పిల్లలను చూస్తే ఈ ముసలి వయసు మళ్లిన వారి ముఖంలో నవ్వు తెచ్చే ప్రయత్నం చేస్తారు. షిఫ్టుల లాంటివి ఏవీ ఉండవని.. ఈ ఉద్యోగంలో చేరిన వారు తమ గార్డియన్ తో కలిసి ఈ నర్సింగ్ హోం మొత్తం షికారు చేయడమే పని అన్నారు. వారికి జీతం కింద డ్రైవర్లు, మిల్క్ పౌడర్ ఇస్తున్నట్లు తెలిపారు.
చిన్న పిల్లలను తీసుకురావడం.. ఆ వృద్ధుల్లో మంచి ఫలితాలను ఇస్తోందని.. తమ మనవలు, మనవరాళ్లతో గడిపినట్లే ఫీల్ అవుతున్నారని వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.