Begin typing your search above and press return to search.
నిర్భయ దోషుల చరిత్ర ఎంత ఘోరమైందో తెలుసా ?
By: Tupaki Desk | 20 March 2020 5:30 PM GMTనిర్భయ కేసు ... ఈ కేసు గురించి తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘోరం పై అప్పట్లో దేశం మొత్తం ఏక తాటిపైకి వచ్చి , నిర్భయ దోషులని కఠినంగా శిక్షించాలని నిరసనలు తెలియజేసారు. దోషులని అయితే , ఘటన జరిగిన వారం రోజులకే పట్టుకున్నారు. కానీ, వారికీ ఉరి శిక్షని వెన్తనె అమలు చేయలేకపోయారు. ఎట్టకేలకి నేడు (మార్చి 20 )నలుగురు ముద్దాయిలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్షలను అమలు చేశారు. ఈ నలుగురు ముద్దాయిలకు ఒకేసారి ఉరికంభానికి వేలాడదీశారు. అర్థగంట తర్వాత నలుగురిని వైద్యులు పరీక్షించి, చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ నలుగురు కామాంధులు చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఈ నలుగురు ముద్దాయిలు తాగుబోతులు, తిరుగుబోతులని తెలుస్తుంది. మొత్తంగా ఆరుగురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా .. వీరిలో ఒకరు మైనర్. మరో ఐదుగురు ముద్దాయి ల్లో రామ్ సింగ్ జైల్లోనే 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇకపోతే ఆ ఆరుగురు దోషుల చరిత్రను పరిశీలిస్తే,..
రామ్ సింగ్ : నిర్భయ ఘటన లో ప్రధాన నిందితుడు ఈ రామ్ సింగ్. నిర్భయని కదులుతున్న బస్సులోనే అత్యంత క్రూరంగా హింసిస్తూ , అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బస్సు నడిపింది ఈ రామ్ సింగ్.
20 ఏళ్ల క్రితమే రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వచ్చి రవి దాస్ మురికివాడలో ఉండేవాడు. ప్రతి రోజూ మద్యం సేవించివచ్చి ఇరుగుపొరుగు వారితో తరుచూ గొడవ పడేవాడు. ఆలా తాగుడుకి బానిసై , అక్కడ పరిచయమైనా కొందరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే నిర్భయ ఘటన లో పోలీసులకి చిక్కిపోయిన తరువాత, ఈ కేసులో మరణం తప్పదని గ్రహించిన రామ్ సింగ్ 2013 మార్చిలోనే జైలు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముఖేశ్ సింగ్ : ఇతను రామ్ సింగ్ కు చిన్న తమ్ముడు. బస్సు నడిపింది తానేనని, తన అన్న కాదని, పైగా తాను నిర్భయపై అత్యాచారం చేయలేదనీ వాదించాడు. అయితే, అతని మాటలు అబద్దం అని మిగిలిన దోషులు చెప్పడంతో ఏం చేయలేకపోయాడు.
అక్షయ్ ఠాకూర్ : నిర్భయ దోషుల్లో అత్యంత తెలివైన వారిలో ఈ అక్షయ్ ఠాకూర్ కూడా ఒకడు. నేరం జరిగిన రోజు ఢిల్లీలో లేనని, బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి అంతకుమందు రోజు అంటే డిసెంబరు 15నే వెళ్లిపోయానని, ఈ కేసు నుండి బయటపడటానికి శతవిధాలా పోరాడాడు. ఉరి శిక్ష ఖరారు అయిన తరువాత కూడా . సుప్రీం కోర్టుని అనేక సార్లు ఆశ్రయించి , ఉరిని తప్పించుకోవాలని ప్రయత్నం చేసాడు. నేరం చేసిననాటికి ఇతని వయసు 28 ఏళ్లు. పెళ్లయి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
పవన్ గుప్తా : నిర్భయను, ఆమె స్నేహితుణ్ని ఇనుపరాడ్ తో ఇష్టం వచ్చినట్టు కొట్టి , ఆమెను ఈడ్చుకొచ్చింది ఈ దుర్మార్గుడే. ఆ ఘోరం జరిగేనాటికి 19 ఏళ్ల వాడు. తాను చేయరాని మహాపాపం చేశానని పవన్ అంగీకరించాడు. ఇతనిని ఎలాగైనా ఉరి నుంచి తప్పించే ఉద్దేశంతో మైనర్ అని నమ్మించే ప్రయత్నాలు కూడా చాల జరిగాయి. కానీ, నిజం నిప్పు లాంటిది , అలాగే దేశం మొత్తం నిర్భయ కి న్యాయం జరగాలి అని కోరుకోవడంతో పవన్ కి ఉరి తప్పలేదు.
వినయ్ శర్మ : ఇతను కూడా రవిదాస్ మురికివాడలో రామ్ సింగ్ ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. రామ్ సింగ్‌కు స్నేహితుడు. జిమ్ లో శిక్షకుడిగా పనిచేసేవాడు. వయసు 25 యేళ్లు. ఆ బస్సులో తాను లేనని బుకాయించాడు. ఆ సాయంత్రం పవన్ గుప్తాతో కలిసి ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లానని కోర్టులో వాదించాడు. నిర్భయ, ఆమె స్నేహితుడి వద్ద ఉన్న డబ్బు, బంగారం దొంగిలించి, అత్యాచారం చేసింది ఈ దుర్మార్గుడే.
లారీ క్లీనర్ ఆరో దోషి (మైనర్) : అతి కిరాతకంగా నిర్భయను అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టిన ఓ వ్యక్తి... మైనర్ అన్న నెపంతో బతికి బయటపడ్డాడు. ఇతను రామ్ సింగ్ దగ్గర క్లీనర్‌గా పనిచేసిన వ్యక్తి. అత్యాచార ఘటన జరిగిన రోజు రాత్రి నిర్భయ కడుపులో పేగులను పెకలించినట్లు వార్తాకథనాలు వచ్చాయి. వీడికి కేసు నుంచి విముక్తి చేయడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. బాలనేరస్థుల గరిష్ట వయోపరిమితి 18 కాదు 16 ఏళ్ల వరకే ఉండాలన్న డిమాండ్లు వచ్చాయి. ఘటన జరిగేనాటికి అతని వయసు 17 ఏళ్ల 285 రోజులు. అంటే 18 ఏళ్ల కంటే తక్కువ కావడంతో అతనిని బాలనేరస్థుల బోర్డు విచారణ జరిపింది . అయితే , కేవలం మైనర్ అన్న ఒకే ఒక కారణంతో ..కేవలం మూడేళ్ళ జైలు శిక్ష అనంతరం రహస్యంగా పోలీసులు విడుదల చేసారు. అయితే , ఆ మైనర్ ఫోటో బయటకి రాకుండా చూడటంతో ..ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో , ఏంచేస్తున్నాడో కొందరు పోలీసులకి తప్పా ..ఇంకెవరికి తెలియదు.