Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఆడవాళ్లు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా?
By: Tupaki Desk | 5 April 2022 4:44 AM GMTహైదరాబాద్... గ్రోయింగ్ గ్లోబల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న నగరం. ఈ నగరంలో కాస్మోపాలిటన్ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఈ నగరం ఓ ఊహించని ప్రమాదాన్ని సైతం ఎదుర్కుంటోంది. హైదరాబాద్లో సగం మంది మహిళలు ఊబకాయులేనని తేలింది. ఇందులో సంసార బాధ్యతల్లో బిజీ అయిపోయిన స్త్రీలే కాకుండా అమ్మాయిలు కూడా ఉండటం ఆశ్చర్యకరం.
రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ఆడవాళ్లలో 30.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుంటే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 51 శాతం మంది ఆడవాళ్లు అధిక బరువుతో ఉన్నారని ఆ సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. 2019-20లో చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాల ఆధారంగా కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ రూపొందించిన ఈ రిపోర్ట్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ప్లానింగ్) కె.రామకృష్ణారావు విడుదల చేశారు. ఇందులో అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అధిక బరువు ఉన్న వారే కాకుండా షుగర్, బీపీ రోగులు కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారు. నడక, వ్యాయామం తగ్గిపోవడమే ఇందుకు కారణమని ప్రభుత్వ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ఆడవాళ్లలో 14.7 శాతం మందికి షుగర్ ఉంటే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 21.2 శాతం మందికి షుగర్ ఉంది. రాష్ట్రంలో 18.1 శాతం మంది మగవారికి షుగర్ ఉంటే, హైదరాబాద్‌లో అత్యధికంగా 26.8 శాతం మందికి షుగర్ ఉంది.
ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 11.6 శాతం మంది మగవాళ్లు, 8.4 శాతం మంది ఆడవాళ్లకు మాత్రమే షుగర్ ఉంది. రాష్ట్రంలో 26.1 శాతం మంది ఆడవాళ్లు బీపీతో బాధపడుతుండగా, హైదరాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 30.2 శాతం మంది బీపీ రోగులున్నారు. రాష్ట్రంలో 31.4 శాతం మగవాళ్లకు బీపీ ఉంటే, హైదరాబాద్‌లో 41.7 శాతం మందికి బీపీ ఉందని రిపోర్ట్‌లో వెల్లడైంది.
ఇక రాష్ట్రవ్యాప్త అంశాల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 43.3 శాతం మంది మగవాళ్లు, 6.7% మంది ఆడవాళ్లు ఆల్కహాల్ తాగుతున్నారు. 5.6 శాతం మంది మహిళలు, 22.3 శాతం మంది మగవాళ్లు పొగాకు తింటున్నారు. సర్వే జరిగే నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో 5.8 శాతం మంది మేజర్లు అవకముందే గర్భం దాల్చారు.
సర్వే జరిగే నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో 23.5 శాతం మందికి బాల్య వివాహాలు జరిగాయి. అత్యధికంగా వికారాబాద్‌లో 39.8 శాతం, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 10.2 శాతం మంది 18 ఏళ్ల కంటే ముందే వివాహాలు అయ్యాయి.