Begin typing your search above and press return to search.

ఏపీ వలన తెలంగాణకి లిక్కర్ ఆదాయం ఎంతో తెలుసా !

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:15 AM GMT
ఏపీ వలన తెలంగాణకి లిక్కర్ ఆదాయం ఎంతో తెలుసా !
X
మద్యం.. దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆదాయ వనరు. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం చేకూర్చే వాటిలో లిక్కర్ ఎప్పుడూ కూడా అగ్రస్థానంలోనే ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు మందుబాబులకి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా కరోనా విజృంభణ సమయంలో లాక్ డౌన్ వేయగా..లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన వెంటనే మొదటగా ఓపెన్ చేసింది కూడా మద్యమే. ప్రభుత్వ ఆదాయం పూర్తిగా కోల్పోవడం తో మద్యం ద్వారానే మళ్లీ ఆదాయం పొందవచ్చు అని ఆలోచించిన ప్రభుత్వాలు మద్యం దుకాణాలని ఓపెన్ చేసాయి. వారు ఊహించిని విధంగా రెస్పాన్స్ వచ్చింది. ఇక, ముఖ్యంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగి..ప్రభుత్వ ఖజనాని నింపుతుంది. తెలంగాణ లాక్ డౌన్ సడలింపుల తరువాత భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని చెప్పాలి. ఏపీలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్టే..రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని తగ్గిస్తూ వస్తుంది. అలాగే లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చి, మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన తరువాత మద్యం ధరల్ని భారీగా పెంచేసింది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే ఈ విధంగా చేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. అయితే, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే తెలంగాణ ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో బోర్డర్ ప్రాంతాల్లో ఉన్నవారు తెలంగాణ నుండి ఏపీ కి మద్యాన్ని తరలిస్తున్నారు. ఇలా ఏపీకి మద్యాన్ని తరలిస్తూ ఈ మధ్య చాలామంది పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఇకపోతే , తెలంగాణ లో మద్యం ఆదాయం సర్కారు ఖజానా నింపుతుంది. ఒక్క జూలై నెలలోనే ఏకంగా రూ. 2507 కోట్ల విలువైన మద్యం తాగేశారు. గతేడాది జూలైలో పోలిస్తే 600 కోట్లు ఎక్కువ ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాల టైమింగ్స్, రేట్లు పెంచడంతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున రవాణా జరుగుతుండటంతో ఆదాయం పెరుగుతుంది. గత నెలలో తెలంగాణ వ్యాప్తంగా 31. 30 లక్షల కేసుల లిక్కర్.. 22.99 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.