Begin typing your search above and press return to search.
వైఎస్ షర్మిల పార్టీ ఇదే.. పేరు ఖరారైపోయింది...
By: Tupaki Desk | 3 Jun 2021 4:30 PM GMTగత కొద్దికాలంగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన దివంగత సీఎం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల ఈ మధ్య దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలోనే ఆమె పర్యటించి బాధితులను పరామర్శించారు. వైఎస్ అభిమానులు, వివిధ జిల్లాల అనుచరులలతో సమావేశాలు కూడా నిర్వహించిన షర్మిల తన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. పార్టీ పేరు, జెండా, అజెండా త్వరలోనే ప్రకటించేందుకు వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్న తరుణంలో ఆమె పార్టీ పేరు ఇదేనంటూ సోషల్ మీడియాలో హల్ చల్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం పేర్కొంటున్నారు.
ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్షలు చేయడం, క్షేత్రస్థాయిలో పర్యటనలతో దూకుడు పెంచుతున్న సమయంలో ఆమె పార్టీ పేరు ఖరారు అయినట్లు సమాచారం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పార్టీ పేరును షర్మిల ఖరారు చేశారట. షర్మిల ముఖ్య అనుచరుడు వాడుక రాజగోపాల్ ఈ పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దీంతోపాటుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాలని ఓ జాతీయ పత్రికలో వారు ప్రకటన కూడా ఇచ్చారు.
ఇక తాజాగా ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామానికి చెందిన కొట్టమొల్ల వెంకటేశ్ (23) కుటుంబాన్ని ఆమె షర్మిల పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.