Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసుల్లో ఏపీ స్ధానం ఏమిటో తెలుసా ?
By: Tupaki Desk | 28 Oct 2021 8:41 AM GMTడ్రగ్స్ కేసులకు సంబంధించి జాతీయస్ధాయిలో ఏపీ 18 వ స్ధానంలో ఉంది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వం చెప్పటం కాదు. స్వయంగా కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ క్రై రికార్డ్స్ బ్యూరో స్పష్టంచేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల వ్యవహారాలను పరిశీలించి క్రైం రేటు పెరుగుతోందా ? లేకపోతే తగ్గుతోందా ? అనే విషయాన్ని బ్యూరో ప్రతి ఏడాది నివేదికను అందిస్తుంటుంది. ఆ నివేదిక ప్రకారం గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాలున్నాయి. వీటి వెనక చాలా రాష్ట్రాలుండగా ఏపీది 18వ స్ధానం.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఏపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాలకన్నా బాగానే పనిచేస్తున్నట్లు లెక్క. గడచిన రెండున్నరేళ్ళల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా, వ్యాపారం తదితరాలను కంట్రోల్ చేయటానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్టాటు చేసింది. ఇప్పటివరకు 2 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని అనుకుందాం. మరి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో అబద్ధాలు చెప్పదు కదా.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వంపై అక్కసుతో చంద్రబాబు అండ్ కో పదే పదే బురద చల్లేస్తోంది. తాను సీఎంగా ఉన్నపుడు రాష్ట్రంలో అసలు గంజాయి సాగు, రవాణా, వ్యాపారం అన్నదే లేన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. వైజాగ్ లోని ఆంధ్ర ఒడిస్సా బార్డర్ (ఏవోబీ) ప్రాంతంలో దశాబ్దాలుగా గంజాయి సాగు జరుగుతోందన్న విషయం చంద్రబాబుతో సహా అందరికీ తెలుసు.
చంద్రబాబు హయాంలో కూడా డ్రగ్స్ కేసుల్లో రాష్ట్రం 16, 17 స్ధానాల్లో నిలిచింది. మరపుడు రాష్ట్రాన్ని చంద్రబాబు డ్రగ్ స్టేట్ గా మార్చేసినట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ కో గోల గోల చేయలేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా గంజాయి వ్యాపారం జరిగేది జరిగేదే. నూరుశాతం కంట్రోల్ చేయటం ఎవరివల్లా సాధ్యంకాదు. కానీ ఇపుడు చంద్రబాబు మాత్రం ఎందుకింత అబద్ధాలు చెబుతున్నారు ? ఎందుకంటే జగన్ మీద అక్కసుతోనే. ఏదో రకంగా జగన్ ప్రభుత్వంపై బురదచల్లేసి కూలదోసేయాలనే కసే చంద్రబాబుతో ఇన్ని అబద్ధాలు చెప్పిస్తోంది.
2019లో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయటం అంత తేలికా ? అన్నది కూడా చంద్రబాబు ఆలోచించటలేదు. పోనీ తాను చెప్పింది చెప్పినట్లు విని చేసే ప్రభుత్వం కేంద్రంలో ఉందా అదీలేదు. అసలు చంద్రబాబును కేంద్రంలోని పెద్దలు దగ్గరకే రానీయటంలేదు. మరలాంటపుడు 2024 షెడ్యూల్ ఎన్నికల వరకు ఆగలేక మధ్యలోనే జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయాలనే చంద్రబాబు కసి ఎలా తీరుతుంది ? ఆ ఫ్రస్ట్రేషన్లోనే తానేం మాట్లాడుతున్నారో కూడా చంద్రబాబు మరచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ విషయం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికతో స్పష్టమైంది.