Begin typing your search above and press return to search.

'నో షేవ్ నవంబర్' వెనుక ఉన్న కథేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Nov 2022 7:55 AM GMT
నో షేవ్ నవంబర్ వెనుక ఉన్న కథేంటో తెలుసా?
X
నవంబర్ వచ్చిదంటే చాలు మగరాయుళ్లంతా గడ్డలు.. మీసాలు పెంచేందుకు ఇష్టపడుతుంటారు. అప్పటి వరకు మహేష్ బాబులా సాప్ట్ గా ఉండే అబ్బాయిలు సైతం నవంబర్ రాగానే రఫ్ అండ్ టఫ్ లుక్కులోకి మారిపోతుంటారు. 'నో షేవింగ్ నవంబర్' అనే కాన్సెప్ట్ తో వీరంతా కూడా 'రంగస్థలం'లో రాంచరణ్.. పుష్పలో 'అల్లు అర్జున్'.. 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ లా గడ్డాలు మీసాలతో దర్శనమిస్తుంటారు.

ఒకప్పుడు గడ్డాలు.. మీసాలు లేకుండా నటించిన బాలీవుడ్ హీరోలంతా కూడా ఇప్పుడు మన దక్షిణాది హీరోలనే ఫాలో అవుతున్నారు. సల్లు భాయ్ వంటి హీరోలు సైతం గడ్డం.. మీసాలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో హాలోవీన్ (దెయ్యాల గోల) ఎలాగో నవంబర్ నెలలో 'నో షేవింగ్' అనే ట్రెండ్ కూడా అలాగే మొదలవుతోంది. దీంతో నంబర్ నెలకు గడ్డానికి ఉన్న లింకేంటి? అన్న ఆసక్తి నెలకొంది.

నిజానికి నవంబర్ నెలలో గడ్డాలు పెంచుకోవాలనే రూలేమీ లేదు. దీనికి వెనుక కేవలం ఒక సదుద్దేశ్యం మాత్రమే ఉంది. పాశ్చత్య దేశాల్లో మొదలైన ఈ ట్రెండ్ ప్రస్తుతం మన దేశానికి కూడా పాకింది. దీంతో ఇండియన్స్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతూ నవంబర్ వచ్చిందంటే గడ్డాలు.. మీసాలను తెగ పెంచేస్తూ తమ ఔదర్యాన్ని చాటుకుంటున్నారు.

'నో షేవింగ్ నవంబర్' అనే కాన్సెప్ట్ మొదటగా అమెరికాలో ప్రారంభమైంది. ఈ నెలలో వారంతా గడ్డం గీసుకోకుండా మిగిల్చిన సొమ్మును క్యాన్సర్ పేషంట్లకు విరాళంగా ఇస్తుంటారు. ఈ కాన్సెప్ట్ మనోళ్లకు పిచ్చ పిచ్చగా నచ్చడంలో ఇండియాలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది.అయితే మనోళ్లకు గడ్డాలు.. మీసాలు మాత్రం విరివిగా పెంచుతున్నారు కానీ విరాళాల్లో మాత్రం వెనుకబడిపోతున్నారు.

చాలామందికి 'నో షేవింగ్ నవంబర్' అనే కాన్సెప్ట్ వెనుక ఉద్దేశ్యం తెలియకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయం తెలిసిన వాళ్లు మాత్రం క్యాన్సర్ నిర్మూలన కోసం పోరాడుతున్న స్వచ్చంధ సంస్థలకు తమవంతుగా విరాళాలను అందజేస్తూ ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.