Begin typing your search above and press return to search.

జాతీయ జెండా విలువెంటో తెలుసా?

By:  Tupaki Desk   |   15 Aug 2021 7:30 AM GMT
జాతీయ జెండా విలువెంటో తెలుసా?
X
బ్రిటిష్ కోరల్లో చిక్కుకున్న భారత్ ను విడిపించేందుకు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను విడిచారు. ఇంగ్లీష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి మరికొందరు ప్రాణాలు పణంగా పెట్టారు. పోరాటాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు..ఎన్నో ప్రయత్నాల ద్వారా మొత్తానికి భారత భూమి నుంచి తెల్లదొరలను వెళ్లగొట్టారు. స్వేచ్ఛాయుత భారతావనిలోకి వచ్చి 75 సంవత్సాలు పూర్తి చేసుకుంది.

సువిశాల భారతావనిలో ఏడాదికి రెండు సార్లు జెండాను ఎగురవేస్తూ జాతీయ కీర్తిని నిలపుకుంటున్నాం. అయితే స్వాతంత్ర్య భారతదేశం రావడానికి ఎన్ని కష్టాలు పడ్డామో చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఆ కష్టాలకు ప్రతిఫలమే ఇప్పుడున్న స్వేచ్ఛావాతావరణం. ఇంతటీ స్వేచ్ఛ కలిగించిన దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఆ తరువాత పాటించే కొన్ని నిబంధనలు మరిచిపోతున్నాం.

పైన కాషాయం, కింద ఆకుపచ్చ రంగు మధ్యలో తెల్లని రంగుపై ధర్మఛక్రం కలిగిన భారతీయ జెండాకు ప్రత్యేక గౌరవం ఉంది. జెండాను వాడేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి.. మరొకొన్ని పద్ధతులు పాటించాలి.. కానీ కొందరు అవేమీ పట్టించుకోవడం లేదు. జెండాకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే జాతీయ జెండాను ఎగురేస్తాం. ఇందులో 15 ఆగస్టు రోజున స్వాతంత్ర్యం వచ్చినందుకు గుర్తుగా జెండా పండుగను నిర్వహించుకుంటాం. అయితే ఈరోజు కొందరు జెండా విలువ తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు.

తలకిందులుగా జెండా ఎగురవేయడం.. సాయంత్రం వరకు ఎగరేసిన జెండాను అలాగే ఉంచడం చేయడం దేశాన్ని అవమానించిన లెక్కే అవుతుంది. ఈయితే ఇవన్నీ నిరక్షరాస్యులో, జెండా విలువ తెలియని వారో అంటే ఊరుకోవచ్చు. కానీ ప్రభుత్వ అధికారులు, విద్యావంతులు ఇలా చేయడం కచ్చితంగా నిర్లక్ష్యమనే చెప్పాలి. మరి వారికి జెండా విలువ తెలియదనలేం. చిన్నప్పటి నుంచి స్వాతంత్ర్య పోరాటం గురించి, మనదేశం గురించి చదువుకున్న వాళ్లే. మరి ఇంత నిర్లక్ష్యమెందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ జెండా విలువ తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే సాంకేతిక విప్లవంలో భాగమైన సోషల్ మీడియాలో స్వాతంత్ర్య శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే జెండా గురించి మాట్లాడుతారు. ఆ తరువాత అసలు విషయం మరిచిపోతుతున్నారు. పనికిరాని వాటికి జెండా రంగులను పులుముతూ జాతీ జెండాను అవమానిస్తున్నారు. ఇష్టమొచ్చిన రీతిలో డ్రెస్సులు వేసుకునే వారు జాతీయ జెండాను ఒంటిపై వేసుకుంటున్నారు. ఇక కొందరు జెండాలను అవమానించే వారి ఫొటోలను హైలెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జెండా విలువ తగ్గొపోతుందనే భావనను మరిచిపోతున్నారు.

వాట్సాప్, ఫేస్బుకుల్లో ప్రచారం కోసం రాతలు, ఫొటోలతో నింపడం కూడా అవమానించినట్లే అవుతుంది. ఇక ఈ కామర్స్ సైట్లపై జెండా కలర్స్ ను ఇష్టమొచ్చినట్లు వాడడం ద్వారా భవిష్యత్ తరాల వారిని అయోమయానికి గురి చేసినట్లే అవుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల నాన్ బెయిలబుల్ నేరం అవుతుందన్న విషయం కూడా గ్రహించాలి అని మేధావులు అంటున్నారు.

2002 కంటే ముందు రోజుల్లో భారతీయ జెండాను స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున తప్ప మిగిలిన రోజుల్లో ఎగురవేయడానికి ఆస్కారం లేదు. కానీ 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్ మార్చింది. జెండాకు అవమానం కలగకుండా మిగతా రోజుల్లోకూడా పగటిపూట ఎగరేసుకోవచ్చని తెలిపింది. అయితే దీనిని ఆసరాగా తీసుకొని కొందరు అవసరం లేని ప్రతీ చోటా జెండాను ఎగురవేస్తున్నారు. అయితే నిబంధనలు పాటిస్తే ఒకే.. ఆ జెండాను అక్కడే వదిలేసి పోతున్నారు. ఇలా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా.. అని జెండాను అవమానించడం అంటే కన్నతల్లికి గౌరవం ఇవ్వని కిందే లెక్కగడుతారని అంటున్నారు.