Begin typing your search above and press return to search.
కరోనాపై కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు ఏమిటో తెలుసా?
By: Tupaki Desk | 21 May 2021 5:41 AM GMTకరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. మొదటి వేవ్ కు భిన్నమైన లక్షనాలు..రోగ తీవ్రత లాంటి అంశాల గురించి తెలిసిందే. తాజాగా మారిన పరిస్థితులు.. కరోనా తీవ్రత నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా అవసరమని ప్రాశ్చాత్య దేశాలు చెబుతుంటే.. కేంద్రం మాత్రం దాని గురించే మాట్లాడని పరిస్థితి.
నిత్యం మాస్కుధరించండి.. శానిటైజ్ చేసుకోండి లాంటి మాటల్ని చెప్పే కేంద్రం.. దేశ ప్రజలకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్న విషయాన్ని మాత్రం చెప్పటం కనిపించదు. తాజాగావిడుదల చేసిన మార్గదర్శకాల్లో కరోనాను అడ్డుకునేందుకు కొన్ని కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఇప్పటివరకు చెబుతున్న డబుల్ మాస్కుతో పాటు.. వెంటిలేషన్ అంశాన్ని ప్రస్తావించారు. మాస్కు ధరించటం.. సామాజిక దూరాన్ని పాటించటం.. శానిటైజ్ చేసుకోవట చాలా ముఖ్యమని చెబుతున్నారు. మిగిలిన విషయాల మీద అందరికి అవగాహన ఉన్నదే. ఇప్పుడు కొత్తగా ప్రస్తావించిన అంశాల్లో వెంటిలేషన్ చాలా ముఖ్యమైనది. దీనిపై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు. అవేమంటే..
- కరోనా సంక్రమణకు కీలకమైన వైరస్ గాలిలో 10 మీటర్ల వరకు వ్యాప్తి చెందే వీలుంది. వైరస్ సోకిన వ్యక్తి డాప్లెట్స్ 2 మీటర్ల వరకు వ్యాప్తి చెందగా.. ఎరోసోల్.. డ్రాప్లెట్స్ కంటే ఐదురెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది.
- ఇంతకీ ఏరో సోల్స్.. డ్రాప్లెట్స్ అంటే ఇంచుమించు ఒకే అర్థం. మనందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే నీటి తుంపరులు. ఐదు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే నీటి బిందువులను ఏరో సోల్స్ గా పిలుస్తారు. అదే ఐదు మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్న వాటిని డ్రాప్లెట్స్ అంటారు. కరోనా వ్యాప్తికి.. నీటి తుంపరులు చాలా చాలా కీలకమన్నది మర్చిపోకూడదు.
- డ్రాప్లెట్స్ కంటే ఏరో సోల్స్ బరువు తక్కువగా ఉండటం వల్ల గాలిలో ఇవి మరింత దూరాన్ని వ్యాపించే వీలుంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రతకు ఇదో కారణం.
- కరోనా ప్రోటోకాల్ (మాస్కు.. శానిటైజ్.. భౌతిక దూరం) తప్పనిసరిగా పాటించాలి. వెంటిలేషన్ తక్కువగా ఉన్న ఇళ్లు.. ఆఫీసుల్లో వాటిని పెంచటం ద్వారా వైరస్ తీవ్రతను తగ్గించే వీలుంది.
- ఇప్పుడున్న వెంటిలేషన్ నను మరింత మెరుగుపర్చుకుంటే.. వైరస్ వ్యాప్తిని మరింత తగ్గించే వీలుంది.
- వెంటిలేషన్ ను మెరుగుపర్చుకోవటం కోసం కిటికీలు.. తలుపులు తెరవటం..ఎగ్జాస్ట్ వ్యవస్థను ఉపయోగించటం లాంటివి చేపట్టాలి.
- క్రాస్ వెంటిలేషన్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వ్యాధి వ్యాప్తిని తగ్గించే వీలుంది. ఆఫీసులు.. ఆడిటోరియంలు.. షాపింగ్ మాల్స్ మొదలైన వాటిలో రూఫ్ వెంటిలేటర్లను వాడటం మంచిది. వాటి ఫిల్టర్లను తరచు శుభ్రం చేయటం లేదంటే.. మార్చటం ద్వారా కూడా ముప్పును తగ్గించే వీలుంది.