Begin typing your search above and press return to search.

బీజేపీ కండువా క‌ప్పుకొన్న వెంట‌నే ఈట‌ల‌కు జ‌రిగే న‌ష్టం ఇదే

By:  Tupaki Desk   |   27 May 2021 3:30 PM GMT
బీజేపీ కండువా క‌ప్పుకొన్న వెంట‌నే ఈట‌ల‌కు జ‌రిగే న‌ష్టం ఇదే
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి ముఖ్య నేత‌ల్లో ఒక‌రిగా గుర్తింపు పొంది అనూహ్య రీతిలో భూ క‌బ్జా ఆరోప‌ణ‌లో ప‌ద‌వి కోల్పోయిన సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ త్వ‌ర‌లో బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈమేర‌కు చ‌ర్చ జ‌రిగాయ‌ని త్వ‌ర‌లో ఈ టీఆర్ఎస్ పార్టీ నేత కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ఒక్క‌టే మిగిలింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, బీజేపీలో చేర‌గానే ఈట‌ల రాజేంద‌ర్ కోల్పోయేది ఇదేన‌ని ప‌లువురు కొత్త వాద‌న‌ చేస్తున్నారు.

ఈటల రాజేందర్ విష‌యంలో ప‌రిణామాల‌న్నీ దాదాపు రెండేళ్లుగా జ‌రుగుతున్న‌వ‌ని అంత‌ర్గ‌త విష‌యాలు తెలిసిన వారు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్దికాలం నుంచి మంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్ అయ్యారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట తిరిగి.. కార్యక్రమాలను విజయవంతం చేసిన ఘనత ఈటలకు ఉన్న‌ప్ప‌టికీ మంత్రి పదవి చివరి నిమిషంలో ఇచ్చారు. పైగా శాఖ మార్చారు. మంత్రి పదవి వచ్చిన తరువాత కూడా పార్టీ ఓనర్లం అంటూ హుజురాబాద్ లో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మరింతగా సీఎంకు .. ఈటలకు నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి తోడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగులకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఈటల హుజురాబాద్ నియోజకవర్గానికి పరిమితం అయ్యేలా చేశారు. ఇలా రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరవాత నెమ్మదిగా ఈటలను బలహీన పరచడం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా భూ కబ్జా విషయాన్ని చూపి మంత్రి పదవి తొల‌గించారు.

అయితే, త‌న‌పై దాడిని ఈట‌ల టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజల దగ్గర వెళ్లి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకుంటానని.. పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తిని తాను కాదని అన్నారు. ఎన్ని రోజులు జెల్లో పెడతావు.. ద‌మ్ముంటే నా ఆస్తులపై నిజాయితీగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈట‌ల రాజేంద‌ర్ వామ‌ప‌క్ష భావ‌జాలం క‌ల మ‌నిషి. ఇప్పుడు కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో స‌దరు ఇమేజ్‌ను ఆయ‌న పోగొట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.