Begin typing your search above and press return to search.

హమ్మ గూగుల్.. ఇంత దొంగ‌వా? ఏం చేస్తోందో తెలుసా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 2:30 PM GMT
హమ్మ గూగుల్.. ఇంత దొంగ‌వా? ఏం చేస్తోందో తెలుసా?
X
టెక్నాల‌జీ పెరుగుద‌ల‌తో ఎంత సౌక‌ర్యం స‌మకూరుతోందో.. ప్ర‌మాదం కూడా అంత‌క‌న్నా ఎక్కువే పెరిగిపోతోంది. ప‌లు యాప్ లు ఫోన్ల‌లో ఇన్ స్టాల్ చేయాలంటే.. ర‌క‌ర‌కాల ప‌ర్మిష‌న్లు అడుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అందుకే.. ఆచితూచి అనుమ‌తి ఇవ్వాల‌ని చెబుతారు టెక్ నిపుణులు.

ఎందుకు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలో అంద‌రికీ తెలిసిందే. కొన్ని ప్ర‌మాద‌క‌ర యాప్ లకు ప‌ర్మిష‌న్ ఇచ్చేస్తే.. మ‌న ఫోన్లోని స‌క‌ల స‌మాచారం మొత్తం క్ష‌ణాల్లో లాగేస్తాయి. కాంటాక్ట్ లిస్టు, ఫొటోలు, వీడియోలు స‌హా.. ఫోన్లో సేవ్ చేసి పెట్టుకున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌, ఏటీఎం పిన్ నంబ‌ర్లు అన్నీ మ‌న‌కు తెలియ‌కుండానే తీసేసుకుంటాయి.

అందుకే.. చాలా మంది గూగుల్ ప్లే స్టోర్ ను విశ్వ‌సిస్తారు. ఇందులో ఉన్న యాప్స్ అన్నీ.. వెరిఫైడ్ అయ్యుంటాయ‌ని, అందువ‌ల్ల ఇక్క‌డి నుంచి ఇన్ స్టాల్ చేసుకున్న యాప్స్ న‌మ్మ‌కంగా ఉంటాయ‌ని మెజారిటీ మొబైల్ యూజ‌ర్లు న‌మ్ముతారు. అయితే.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగ‌దారులంద‌రికీ షాకిచ్చే విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌నం ఫోన్లో మాట్లాడే ప్ర‌తీ మాట‌ను గూగుల్ చాటుగా వింటోంద‌ట‌! గూగుల్ అసిస్టెంట్ ద్వారా వినియోగ‌దారుల రికార్డింగ్స్ ని త‌మ కంపెనీ ఉద్యోగులు వింటున్నార‌ని, ఇదంతా.. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ తో జ‌రుగుతోంద‌ని గూగుల్ ప్ర‌తినిధులు చెబుతున్న‌ట్టు స‌మాచారం. ఇదే విష‌యాన్ని అధికారికంగా అంగీక‌రించ‌బోతోంద‌ని, ఈ మేర‌కు పార్ల‌మెంట‌రీ క‌మిటీ స‌మావేశంలో ఒప్పుకోబోతోంద‌ని తెలుస్తోంది.

గూగుల్ అసిస్టెంట్ ఆప్ష‌న్ ఉన్న ఫోన్ల ద్వారా మాట్లాడే మాటాల‌న్నీ వింటోంద‌ట‌! అయితే.. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనూ ఈ ఆప్ష‌న్ ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. మ‌రి, ఈ వ్య‌వ‌హారం ఎటు వెళ్తుంది. దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చూడాలి. అయితే.. అప్ప‌టి వ‌ర‌కూ సీక్రెట్లు గ‌ట్రా ఏమైనా ఉంటే.. ఫోన్లో మాట్లాడ‌డం ఆపేయండి ఎందుకైనా మంచిది! ఎటొచ్చి ఎటు పోతుందో ఎవ‌రికెరుక‌.