Begin typing your search above and press return to search.

బిల్‌గేట్స్ వాడుతున్న మొబైల్ ఏంటో తెలుసా..?

By:  Tupaki Desk   |   23 May 2022 4:22 AM GMT
బిల్‌గేట్స్ వాడుతున్న మొబైల్ ఏంటో తెలుసా..?
X
ఈ కాలంలో కాలేజీ చదివే కుర్రాళ్ల చేతిలోనే నంబర్ వన్ మోడల్ ఫోన్లు ఉంటున్నాయి. అలాంటిది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దగ్గర ఎంత కాస్ట్లీ మొబైల్ ఉండాలి. ఏ ఆపిల్ ఫోనో.. లేదా తన కంపెనీకి చెందిన మైక్రోసాఫ్ట్ ఫోన్‌నో ఆయన వాడుతున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన వాడుతున్న మొబైల్ శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్. అదేంటి అంత పెద్ద కంపెనీకి యజమాని.. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు.. పెద్ద బిజినెస్‌మేన్ ఆయన ఆ ఫోన్ వాడటమేంటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదివేయండి..

ప్రముఖ టెక్ దిగ్గజం.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ ఈ వారం రెడిట్ ఆస్క్‌ మీ ఎనీథింగ్(Ask Me Anything..?) కార్యక్రమంలో తన మొబైల్ గురించి సమాధానం ఇచ్చారు. తన వద్ద ఉంది శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్-3 అని చెప్పారు. కాగా, రెండు హై ఎండ్‌ స్క్రీన్‌లతో ఉండే మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్ డుయో (Surface Duo) స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3’లో ఉన్న ఫీచర్లే ఉన్నాయి. రెండు తెరల్లో ఆండ్రాయిడ్‌ ఫీచర్లను మరింత సమర్థంగా వాడుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఆ ఫోన్‌ని రూపకల్పన చేసింది.

గేట్స్ తన ఫోన్ పేరు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అంత పెద్ద బిజినెస్‌మేన్ ఇలాంటి మోడల్ ఫోన్ వాడటమేంటని షాకయ్యారు. అయితే దానికీ ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఏ పని చేసినా డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. అలాగే నేను తినే తిండి.. జీవించే విధానం.. వాడే వస్తువులు కూడా అందరి కంటే భిన్నంగా ఉండేలా ప్రయత్నిస్తా.. శాంసన్ ఫోల్డ్-3 మొబైల్ ఎందుకు వాడుతున్నానంటే.. ఈ స్క్రీన్‌తో నేను పోర్టబుల్‌ పీసీ, మొబైల్‌ను పొందగలను తప్ప మరేమీ లేదు. ’’ అని గేట్స్‌ వివరణ ఇచ్చాడు.

యాపిల్‌ ఐఫోన్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ మొబైల్‌ను ఉపయోగిస్తున్నట్లు బిల్‌ గేట్స్‌ గతంలో వెల్లడించారు. ఆ తర్వాత తన మొబైల్‌ పేరును ప్రత్యేకంగా వెల్లడించడం ఇదే తొలిసారి. మరోవైపు మైక్రోసాఫ్ట్‌తో శాంసంగ్‌కు కొన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉండటం వల్ల గేట్స్‌ ఈ మొబైల్‌ వాడటానికి ఓ కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే బిల్‌గేట్స్ తను వాడుతున్న మొబైల్ గురించి చెప్పగానే.. నెటిజన్లు ఆ ఫోన్ గురించి ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించారు. ఆ మొబలై ఫీచర్లు, ధర, బిల్‌గేట్స్ ఏ కలర్ ఫోన్ వాడుతున్నారు? లాంటివి సర్చ్ చేశారు. మీరు కూడా ఆ మొబైల్ గురించి తెలుసుకోండి మరి..

జెడ్ ఫోల్డ్ 3 ఫీచర్లు.. ధర.. : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 విషయానికొస్తే.. 12GB ర్యామ్‌/ 256 GB స్టోరేజ్‌తో వచ్చే ఈ మోడల్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.1,49,999గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 7.6-అంగుళాల డిస్‌ప్లే.. ఫోన్‌ని మూసినప్పుడు 6.2-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనుక వైపు మూడు 12 ఎంపీ కెమెరాలు.. ఫోన్ తెరిచినప్పుడు 4 ఎంపీ, మూసినప్పుడు 10 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 4,400 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్‌ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్స్ వైర్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.