Begin typing your search above and press return to search.

భార‌త్‌పై అణుయుద్ధం చేస్తాన‌న్న పాకిస్థాన్‌.. ప‌రిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:30 PM GMT
భార‌త్‌పై అణుయుద్ధం చేస్తాన‌న్న పాకిస్థాన్‌.. ప‌రిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా?
X
ఇంకేముంది.. భార‌త్‌పై అణుయుద్ధ‌మే చేస్తాం.. అంటూ కోత‌లు కోసిన దాయాది దేశం పాకిస్థాన్ ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మాట‌లు కోట‌లు దాటించిన పాకిస్థాన్ నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అంటే.. అడుక్క‌తింటున్నార‌ని అంటున్నారు అంత‌ర్జాతీయ ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవ‌డ‌మే!

అంతేకాదు... పూట‌గ‌డ‌వ‌ని స్థితిలో ఉన్నాం.. తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థలతోపాటు వివిధ దేశాలను పాక్ ప్ర‌భువులు వేడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడపలేక ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించడం వంటి చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో అమెరికాలోని పాకిస్థాన్ రాయ‌బార కార్యాల‌యంలో ఉన్న ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది.

వాషింగ్టన్‌లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. జువిష్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 6.8 మిలియన్‌ డాలర్లతో అత్యధికంగా బిడ్‌ను వేసినట్లు తెలిపింది. ఇందులో రెండో స్థానంలో భారత్‌కు చెందిన రియాల్టీ సంస్థ నిలిచింది. 5మిలియన్‌ డాలర్లతో భారత్ సంస్థ బిడ్‌ వేయగా.. పాకిస్థాన్‌కు చెందిన మరో రియాల్టీ సంస్థ 4మిలియన్‌ డాలర్లను కోట్‌ చేసింది.

పాకిస్థాన్‌కు వాషింగ్టన్‌లోని రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. వాషింగ్టన్ నగరంలోని ప్రధాన కేంద్రమైన ఆర్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 1953-56లో అప్పటి పాకిస్థాన్ రాయబారి సయ్యద్ అంజద్‌ అలీ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2000 వరకు అందులో కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త భవనంలో పాక్ ఎంబసీ కొనసాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.