Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న నగరం ఏంటో తెలుసా..!

By:  Tupaki Desk   |   29 March 2021 4:30 PM GMT
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న నగరం ఏంటో తెలుసా..!
X
బ్యాంకాక్ అంటే పడిచచ్చే పర్యాటకులు ఎంతో మంది ఉన్నారు. కాస్త గ్యాప్ దొరికితే చాలు బ్యాంకాక్ లో వాలిపోతుంటారు. ఈ అందమైన నగరం నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అయితే బ్యాంకాక్ సొంతూరు లాంటిదే. సినిమా కథ రాసుకోవడానికి కూడా అయినా బ్యాంకాక్ కు వస్తుంటారు. అందరూ అంత ఇష్టపడే బ్యాంకాక్ కు మరో ఉంది తెలుసా. అది ఎంత పెద్ద పొడవైన పేరు అంటే ఏకంగా గిన్నిస్ బుక్ లో కూడా పేరు సంపాదించుకుంది.

ఇంతకూ బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే ' క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటచా నివేట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్ హిట్ సక తాట్టియా విక్సనుకమ్ ప్రసిట్' పాలీ, సంస్కృత భాషలోని పదాలతో ఈ పేరు పెట్టారు.

ఈ పొడవైన పేరుకు ఉన్న అర్థం ఏమిటంటే.. 'దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజ భవంతుల నగరం, మానవ రూపంలో అవతరించిన దేవత ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం'. కింగ్ మాంగ్ కుట్ మహారాజు బ్యాంకాక్ కు ఈ పేరు పెట్టారు. 15వ శతాబ్దంలో ఆయుత్తయ రాజులు ఒక పల్లెటూరు గా ఉన్న బ్యాంకాక్ ను నగరంగా అభివృద్ధి చేశారు. ఆయన హయాం తర్వాత కూడా వివిధ రాజులు ఈ ప్రాంతాన్ని ప్రధాన నగరంగా చేసుకొని పాలిస్తూ వచ్చారు.

1782లో కింగ్ రామ బ్యాంకాక్ నగరాన్ని రాజధానిగా మార్చాడు. ఆయన హయాంలో బ్యాంకాక్ ను 'క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ', 'క్రుంగ్ థెప్ మహా నిఖోన్ సి ఆయుత్తయ' అని పిలిచేవారు. ఆ తర్వాత 1833 లో బ్యాంకాక్ నగరాన్ని మరో పేరుతో పిలవడం ప్రారంభించారు. 'సియా-యుతీయగా పిలిచేవారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా ఈ పేరునే ఉపయోగించారు.

1850లలో కింగ్ మాంగ్ కుట్ బ్యాంకాక్ కు 'క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటచా నివేట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్ హిట్ సక తాట్టియా విక్సనుకమ్ ప్రసిట్' అనే పొడవైన పేరు పెట్టారు. పడు పేరు గల నగరంగా కూడా బ్యాంకాక్ గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించింది. మనమైతే ఇప్పటికీ ఆ నగరాన్ని బ్యాంకాక్ అని పిలుస్తుంటాం కానీ స్థానికులు మాత్రం ఇప్పటికీ ఆ పొడవు పేరునే కుదించి చిన్నచిన్న పేర్లతో పిలుస్తుంటారు.