Begin typing your search above and press return to search.
భారీ భూకంపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా?.. లైవ్ వీడియో
By: Tupaki Desk | 20 Sep 2022 12:00 PM GMTభూకంపం అంటే సినిమాల్లో చూడడమే కానీ లైవ్ లో మనం చూసింది చాలా తక్కువ. వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవడానికే అందరూ చూస్తారు.
కానీ తాజాగా తైవాన్ లో భారీ భూకంపం విజువల్స్ కెమెరాకు చిక్కాయి. తైవాన్ ను భారీ భూకంపం కుదిపేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రకంపనల తీవ్రతకు ఏకంగా ఓ రైలు ఊగిపోయింది. పలు భవనాలు కుప్పకూలాయి. చాలా మంది మరణించారు. భారీ భూ ప్రకంపనలతో తైవాన్ వణికిపోయింది.
వరుస భూకంపాలు ఈ ద్వీప దేశాన్ని కుదిపేశాయి. రిక్టర్ స్కేలు మీద భూప్రకంపనాల తీవ్రత 6.4 నుంచి 6.9 వరకూ నమోదైంది. షిసాంగ్ పట్టణంలో భూమికి 7 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉందని తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపానికి పలు భవనాలు కుప్పకూలాయి. రోడ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
భూకంప తీవ్రతకు హువాలియన్ నగరం యులి టౌన్ లోని మూడంతస్తుల భవనం కూలిపోయింది. అందులో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది కాపాడారు.ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో సిబ్బంది ఒకరు చనిపోయారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 146 మంది గాయపడ్డారని తెలిపారు.
హువాలియన్ నగరం శివారులోని ఓ వంతెన కుప్పకూలింది. వంతెన కింద చిక్కుకొని కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. పులి టౌన్ లోని డోంగ్లీ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. మరోచోట ప్రకంపనాలకు ఓ రైలు పట్టాలపైనే ఊగిపోయింది. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు భికుభిక్కుమంటూ స్తంభాలను పట్టుకొని కూర్చున్నారు. వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండోర్ స్టేడియం పైకప్పు కూలిపోతుండగా టెన్నిస్ ప్లేయర్లు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

ताज़ा रिपोर्ट के मुताबिक़ ताइवान में आए भूकंप की तीव्रता 7.2 है। देखिए स्टेशन पर खड़ी ट्रेन भूकंप के दौरान कैसे हिचकोले लेने लगी
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) September 18, 2022
pic.twitter.com/KVGRs2Mgvr