Begin typing your search above and press return to search.

ఎక్కువ మద్యం తాగేది ఏ జిల్లాలో తెలుసా?

By:  Tupaki Desk   |   7 April 2022 10:55 AM GMT
ఎక్కువ మద్యం తాగేది ఏ జిల్లాలో తెలుసా?
X
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అంటాడు నాటి గిరీషం.. మందు తాగనివాడు అసలు మనిషే కాదంటాడు నేటి ఆధునిక గిరీషం.. ఈరోజు మద్యం తాగడం అనేది కామన్. ఆడమగా తేడా లేకుండా అందరూ మద్యం తాగుతున్నారు. అయితే ఈ మద్యం వ్యసనంగా మారుతోంది. లేనిపోని రోగాలు ముంచుకొస్తున్నాయి.

ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి.ఇప్పుడు మద్యం తాగడం అనేది కామన్ గా మారిపోయింది. ఆడవాళ్లు కూడా ఈజీగా తాగేస్తున్న రోజులివీ.. పార్టీలు, పబ్బులు, పండుగలు, ఏదైనా సరే మద్యం ఉండాల్సిందే. లాక్ డౌన్ సడలించాక 43 రోజుల తర్వాత మద్యం షాపుల ముందు కూడా మగువలు క్యూలు కట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇంతటి తాగుబోతుల సమాజంలో ఉన్న మనం ఇక మద్యాన్ని అంటరానితనంగా చూడలేం. అది మనలో ఒక భాగమైందనే అనుకోవాలి. అందుకే మద్యం పోటీలు భవిష్యత్తులో జరగొచ్చు. ఆ పోటీల్లో ఖచ్చితంగా ఈ జిల్లాల వారే తొలి స్థానంలో నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో అత్యధిక మద్యం తాగేది వాళ్లే మరి.

తెలంగాణలో మద్యం తాగేవారు అధికంగా జనగామ జిల్లాలో ఉన్నారు. ఆ జిల్లా జనాభాలో 60.6 శాతం మద్యం ప్రియులున్నారని ప్లానింగ్ విభాగం నివేదిక చెబుతోంది. 58.4 శాతం యాదాద్రి, 56.5 శాతంతో మహబూబాబాద్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో కేవలం 28శాతం మంది మాత్రమే మందుబాబు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇక తెలంగాణలో మద్యం తాగేవారి సంఖ్య సగటున 43.3శాతంగా ఉంది. ఇక ప్రతి 100 మంది మహిళల్లో ఏడుగురు మద్యం తాగతుండడం విశేషం. ఇందులో మెదక్ జిల్లాలోనే మహిళలు మద్యం తాగే వారిశాతం ఏకంగా 23.8 శాతంగా ఉంది.