Begin typing your search above and press return to search.
లోకేష్ కు క్రేజ్ ఎందుకు లేదో తెలుసా?
By: Tupaki Desk | 25 March 2021 10:50 AM GMTపండిత పుత్రులు పామరులు కాలేదన్నది ఓ తెలుగు సామెత.. అయితే రాజకీయాల్లో చాలా మంది దిగ్గజ నేతల కుమారులు తండ్రుల బాట అధికారాన్ని అధిరోహించారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ సీఎం కాగా.. తెలంగాణలో కేసీఆర్ కు దగ్గ కేటీఆర్ ఉన్నాడు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ స్తాయిలో ప్రభావం చూపడం లేదని తెలుగు తమ్ముళ్లు తెగ వాపోతున్నారట.. ఇప్పుడు ఇదే టీడీపీ యువ బ్యాచ్ నేతల్లో తీవ్ర చర్చకు దారితీసిందట..
ఎంత ప్రయత్నించినా.. ఎంత డబ్బా కొట్టినా.. మీడియాలో హోరెత్తించినా టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ కు క్రేజ్ ఎందుకు రావడం లేదని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. టీడీపీలో కొత్త వారసులు గత ఎన్నికల్లో తెరపైకి వచ్చారు. వారందరినీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సహించారు. లోకేష్ తోపాటు వారిని తీసుకొని రావాలని 2019 ఎన్నికల్లో నిలబెట్టారు. కానీ అందరూ జగన్ వేవ్ లో కొట్టుకొని పోయారు.
లోకేష్ తో సహా అందరూ టీడీపీ నేతల వారుసులు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత వాళ్లతో యూత్ లో టీడీపీకి పెద్దగా ఫాలోయింగ్ వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వారి వల్ల టీడీపీకి పెద్దగా ప్రయోజనం కలుగలేదు. టీడీపీ వారసులతోపాటు లోకేష్ వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం కానరాలేదని తేలిందట..
ఒక ప్రముఖ చానెల్ లో పనిచేసే సీనియర్ జర్నలిస్టుతో ఫీడ్ బ్యాక్ తీసుకొని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తూ లోకేష్ ను అమాంతం రాజకీయంగా పైకిలేపేలా ప్రయత్నించారట.. కానీ క్షేత్రస్థాయిలో తిరిగి టీడీపీ వారసులకు లోకేష్ నుంచి పెద్దగా స్పందన లేదు అని తేలింది. అందుకే టీడీపీ భావి వారసులు కూడా ఇన్ యాక్టివ్ అయిపోయి వాళ్లంతట వాళ్లే హైదరాబాద్ , బెంగళురు సహా వివిధ నగరాలకు వెళ్లి వేరే పనులు చేసుకుంటున్నారు.
ఆఖరికి పరిటాల శ్రీరాం కూడా ఈ మధ్య నియోజకవర్గంలో కూడా కాలు పెట్టలేకుండా దూరంగా ఉంటున్నాడట.. పార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు అని అంటున్నారు. అనంతపూర్ లో చంద్రబాబు రెడ్డిలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంటే.. అదే జిల్లా యూత్ బ్యాచ్ అంతా బెంగళూరుకు వెళ్లారట..
కోస్తా టీడీపీ యువత అంతా హైదరాబాద్ కు వెళ్లి కన్ స్ట్రక్షన్ బిజినెస్ చేసుకుంటున్నారట.. కాబట్టి లోకేష్ కు తోడుగా ఏపీలో యువ నేతలే కరువయ్యారట.. లోకేష్ కు పెద్దగా సబ్జెక్ట్ లేకుండా ఉన్నాడని.. చంద్రబాబు దగ్గరికి వెళితే లోకేష్ దగ్గరకు వెళ్లమంటున్నారట.. దీంతో ఇక ఇదంతా చాలనుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని టీడీపీ యువ వారసులు డిసైడ్ అయ్యారంట.. అందుకే లోకేష్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు అంట..