Begin typing your search above and press return to search.
ట్రైన్ జర్నీలు చేస్తుంటారా? ఈ యాప్ గురించి తెలుసుకోవాల్సిందే
By: Tupaki Desk | 26 Nov 2022 6:33 AM GMTప్రయాణానికి అనువుగా ఉండే ప్రజారవాణాలో ముందు వరుసలో ఉంటుంది రైలు ప్రయాణం. రోజుల తరబడి ప్రయాణం చేసినా బోర్ కొట్టని ప్రత్యేకత రైలుకే ఉందని చెప్పాలి.విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని సాగించే వీలుంది. అలాంటి ట్రైన్ లో ప్రయాణించే వారికి ఇప్పుడు ఎదురవుతున్న సమస్య.. తాము బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్టు టికెట్లు కన్ఫర్మ్ కాకపోవటం తెలిసిందే. దీంతో..
చివరి నిమిషాల్లో టికెట్లు కన్ఫర్మ్ కాక ప్రయాణాల్ని వాయిదా వేసుకునే వారు బోలెడంత మంది కనిపిస్తుంటారు. అలాంటిది అందుకు భిన్నంగా వెయిటింగ్ లిస్టు విషయంలో పక్కాగా సమాచారాన్ని ఇవ్వటమే కాదు.. తమ అంచనాలు తప్పు అయితే ట్రైన్ జర్నీ స్థానంలో విమానంలో వెళ్లేలా ప్లాన్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అదేం యాప్ అన్న విషయంలోకి వెళితే..
ట్రైన్ మ్యాన్ అనే యాప్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే.. ట్రైన్ టికెట్లుబుక్ చేసుకున్న వారు.. సరైన సమయంలో టికెట్లు కన్ఫర్మ్ కాకుంటే.. వారికి ఏదోలా వారి ప్రయాణం నిలిచిపోకుండా.. అదనపు వసూళ్లకు పాల్పడకుండా ఉండటమే లక్ష్యమని చెబుతున్నారు. ట్రైన్ మ్యాన్ యాప్ లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా చేసినందుకు నామమాత్రపు ఫీజు తప్పించి అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లకు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత ఉంటాయన్న విషయాన్ని అంచనా వేసి చెబుతుంది. ఒకవేళ.. అత్యవసర సమయాల్లో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకుంటే.. తమ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారికివిమాన టికెట్లను అందిస్తామని.. ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తాము మాట ఇచ్చినట్లుగా.. తాము చెప్పినట్లే నమ్మి టికెట్ కొనుగోలు చేసిన వారికి.. ఒకవేళ ఫైనల్ చార్ట్ లో టికెట్ కన్ఫర్మ్ కాకుంటే.. దానికి బదులుగా ఆ రూట్ లో ఉండే ఫ్లైట్ టికెట్ ను ప్రయాణికులకు ఉచితంగా అందిస్తామని ఈ యాప్ నిర్వాహకులు చెబుతున్నారు.
విన్నంతనే ఊరించే ఆఫర్ ఉన్న ఈ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రయాణం పక్కా అన్న భావన కలిగేలా ఆఫర్లు ఉండటం గమనార్హం. అయితే.. ఇందుకోసం ట్రిప్ అస్యూరెన్స్ అనే ఫీచర్ తోనే టికెట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందులో టికెట్ కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం లభిస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పిన తర్వాత.. అందుకు తగ్గట్లు జరగకపోతే ఫ్లైట్ టికెట్లు ఇస్తామన్న ఆఫర్ అందరిని ఆకర్షించేలా మారిందంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఒకసారి ట్రై చేస్తే మరింత క్లారిటీ రావటం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.