Begin typing your search above and press return to search.
ఇంకా మమతను నమ్ముతారా ?
By: Tupaki Desk | 9 Sep 2022 6:44 AM GMTనాన్ఎన్డీయే పార్టీలన్నీ కలుస్తాయని వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్ళీ మొదలుపెట్టారు. కోల్ కత్తాలో తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో మమత మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని గద్దె దింపడం ఖాయమన్నారు. బీజేపీ అహంకారమే జనాల ఆగ్రహం రూపంలో ఎన్డీయేని ఓడించటం ఖాయమని దీదీ అంచనా వేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒకవైపు మిగిలిన పార్టీలన్నీ మరోవైపు నిలబడతాయని మమత చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని మమత కోరటంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే నాన్ ఎన్డీయే పార్టీలన్నింటినీ ఒకటిచేయాలని ఒకపుడు మమతే ప్రయత్నంచేశారు. అయితే తానుచేసిన ప్రయత్నాలకు తానే చివరలో గండికొట్టారు. నాన్ ఎన్డీయే పార్టీల్లో ఐకమత్యం ఉందని నిరూపించేందుకు రాష్ట్రపతి ఎన్నిక ఒక అవకాశంగా వచ్చింది. మమత ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాను అభ్యర్ధిగా మిగిలిన పార్టీలన్నీ ఆమోదించాయి.
అయితే తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ ప్రతిపాదించిన మార్గరెట్ ఆల్వాకు మమత ఎదురుతిరిగారు. మార్గరెట్ కు మద్దతివ్వటం ఇష్టంలేని మమత ఏకంగా ఎన్నికనే బహిష్కరించటంతో ప్రతిపక్షాలన్నింటికీ పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. పైగా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగటానికి ముందు ఎన్డీయే అభ్యర్ధి జగదీప్ ధనకడ్ తో మమతో భేటీ అయ్యారు.
అప్పటివరకు బెంగాల్ గవర్నర్ కు ఉన్న జగదీప్-మమత మధ్య పరిస్దితిలు ఉప్పునిప్పులాగుండేది. అలాంటి జగదీప్ తో మమత భేటీ అవటాన్ని ప్రతిపక్షాలు ఏమాత్రం ఊహించలేదు. భేటీ అవటమే కాకుండా ఎన్నికనే బహిష్కరించటమంటే పరోక్షంగా జగదీప్ గెలుపుకు మమత సహకరించినట్లయ్యింది.
ఉపరాష్ట్రతి ఎన్నికలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసిన మమత ఇపుడు మళ్ళీ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపివ్వటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. రేపు ఏదైనా సందర్భం వస్తే మళ్ళీ ప్రతిపక్షాలను మమత దెబ్బకొట్టరనే గ్యారెంటీ ఏమీలేదు. మమతను నమ్ముకుని ప్రతిపక్షాలు ముందుకెళితే అంతేసంగతులని ఇప్పటికే రుజువైంది. ఈ నేపధ్యంలో అసలు ప్రతిపక్షాలు మమతను నమ్ముతాయా అనేది కూడా ప్రశ్నార్ధకమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.