Begin typing your search above and press return to search.

మోడీ టీంలో మీరు చేరుతారా?

By:  Tupaki Desk   |   25 Aug 2016 8:44 AM GMT
మోడీ టీంలో మీరు చేరుతారా?
X
ప్ర‌ధాని మోడీని వ్య‌తిరేకించేవారు ఎంద‌రున్నారో ఆయ‌న్ను అభిమానించేవారు అంత‌కుమించిన సంఖ్య‌లో ఉన్నారు. ఛాన్సు దొరికితే మోడీ కోసం ప‌నిచేయాల‌ని.. ఆయ‌న‌తో క‌లిసి పనిచేయాల‌ని అనుకునేవారూ ఉన్నారు. అలాంటివారికి ప్ర‌భుత్వం మంచి ఛాన్సు క‌ల్పిస్తోంది. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని డిజిటల్ ఇండియా - మై గ‌వ్ లో భాగ‌స్వాములుగా ఉద్యోగావకాశాలు అందుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. దీనికోసం అన్ని కేంద్ర మంత్రివర్గ విభాగాల్లో నిపుణులైన యువత నుంచి కేంద్రం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎడిటోరియల్ రైటర్లు - రీసెర్చర్లు - సాఫ్ట్ వేర్ డెవలపర్లు - డేటా సైంటిస్టులు - గ్రాఫిక్ డిజైన్లర్లు - స్క్రిప్ట్ రైటర్లు - యాప్ డెవలపర్లు... ఇలా వివిధ పోస్టులున్నాయి. దీనిక అప్ల‌యి చేయాల‌నుకునేవారు రెజ్యూమేను పీడీఎఫ్ ఫార్మాట్ లో ఒక పేజీలో తయారు చేసి పంపించాల్సి ఉంటుంది. ఏ పోస్టును కోరుకుంటున్నారో తెలుపుతూ రెజ్యూమ్ ను అప్ లోడ్ చేయాలి. ఉదాహరణకు అకడమిక్ ఎక్స్ పర్ట్ పోస్టుకు దరఖాస్తు చేస్తుంటే, కామెంట్ బాక్స్ లో 'హ్యాష్ టాగ్ అకడమిక్ ఎక్స్ పర్ట్' ( #AcademicExpert) అని టైప్ చేసి రెజ్యూమ్ అప్ లోడ్ చేయాలి. వీటిని ప‌రిశీలించి బృంద చ‌ర్చ‌లు - మౌఖిక ప‌రీక్ష‌ల త‌రువాత వేతన ప్యాకేజీ నిర్ణ‌యిస్తారు. దరఖాస్తులను "https://www.mygov.in/task/do-you-want-work-government/"లో పంపవచ్చు.

కాగా ఇప్పటివరకూ 154 మంది దరఖాస్తు చేయగా - ఒక్కరిని కూడా ఎంపిక చేయ‌లేద‌ని.. అన్ని ద‌ర‌ఖాస్తులు పెండింగులో ఉన్నాయ‌ని తెలుస్తోంది. మోడీ త‌ర‌ఫున మీడియా విభాగంగా, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేసే ప‌నిగా ఉండొచ్చ‌ని చెబుతున్నారు.