Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారంపై డాక్టర్ ఆత్మహత్య
By: Tupaki Desk | 4 Oct 2020 4:00 PM GMTకేరళలో దారుణం జరిగింది.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి మనస్థాపం చెందిన 35 ఏళ్ల వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. బాత్ రూమ్ గోడపై సారీ అని రాసి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.
కేరళలోని కొల్లామ్ లో అనూప్ ఆర్థో కేర్ అనే ఆసుపత్రిని నడుపుతున్న అనూప్ కృష్ణన్ అందులో ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నాడు. గత నెల 27న తన ఆసుపత్రిలో 7 ఏళ్ల బాలికకు సర్జరీ చేసే సమయంలో ఆమె మరణించింది.
బాలిక మృతికి నిరసనగా ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో అనూప్ కు వ్యతిరేకంగా కామెంట్లు, విమర్శలు వెల్లువెత్తాయి.
వీటన్నింటిని భరించలేకపోయిన అనూప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. ఆపరేషన్ జరిగే సమయంలో బాలిక మరణించడం ఆయనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. అదే అసలు కారణమని తేల్చలేమని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.