Begin typing your search above and press return to search.
న్యూయార్క్ ఆసుపత్రిలో 'డాక్టర్' కాల్పులు
By: Tupaki Desk | 1 July 2017 5:29 AM GMTఅగ్రరాజ్యమైన అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ లెబనాన్ ఆసుపత్రితో డాక్టర్ వేషంలో వచ్చిన ఒక వ్యక్తి విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.
తాజాగా చోటుచేసుకున్న ఈ ఉదంతం కలకలాన్ని రేపింది. డాక్టర్ కోటులో వచ్చిన ఒక వ్యక్తి రైఫిల్ తో ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఉదంతంలో ఐదుగురికి తూటాల గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురు వైద్యులుగా భావిస్తున్నారు. కాల్పుల ఉదంతం గురించి సమాచారం తెలిసిన వెంటనే దుండగుణ్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఆసుపత్రి 16.. 17 అంతస్తుల్లో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం 16వ అంతస్తు నుంచి పొగలు వస్తున్నట్లుగా గుర్తించారు. కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రితో డాక్టర్ వేషంలో వచ్చి కాల్పులు జరిపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/