Begin typing your search above and press return to search.
గుండెపోటుతో అల్లాడుతున్నా తాకని వైద్యులు..కూతుర్ల ముందే ప్రాణాలు వదిలిన తండ్రి
By: Tupaki Desk | 18 Aug 2020 12:10 PM GMTకరోనా భయం నిండు ప్రాణాలను బలిగొంది. గుండెపోటు వచ్చి నొప్పితో అల్లాడుతున్న వ్యక్తిని డాక్టర్లు కనీసం తాకకపోవడంతో కన్న కూతుర్ల ముందే అతడు ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందడం లేదు. గుండెకు సంబంధించిన సమస్యలు గానీ, ప్రసవం, ప్రమాదాలు జరిగే అత్యవసర పరిస్థితుల్లో వెళ్తే వైద్యులు పట్టించుకోవడం లేదు. ఎటువంటి వైద్యం అందించాలన్న ముందు కరోనా పరీక్షలు చేయించుకుని రావాలని చెబుతున్నారు. ఆ తర్వాతే పరీక్షలు చేస్తామంటున్నారు. అత్యవసర వైద్యానికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకుని ఫలితాలు రావ డానికి సమయం పడుతుండటంతో పరిస్థితి విషమించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వల్ల ప్రస్తుతం అత్యవసర వైద్యం కరువైంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు.
వినుకొండ కు చెందిన ఓ వ్యక్తికి తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కూతుళ్లు తెల్లవారుజామున ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా పరీక్షలు లేకుండా వైద్యం చేయడం కుదరదని ఆసుపత్రి సిబ్బంది చెప్పి అతడిని అలాగే వదిలేశారు. తీవ్రమైన గుండెపోటుతో అతడు తన కూతుర్ల ముందే ప్రాణాలు వదిలాడు. అతడి పరిస్థితి చూసి అక్కడి వాళ్ళు కంటతడి పెట్టుకున్నారు. తమకు వైద్యం అందడం లేదని సాక్షాత్తు కలెక్టర్ కు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన రాలేదని బాధితులు ఆరోపించారు. ఉన్నచోటనే తమ తండ్రి చనిపోతే కనీసం మృతదేహాన్ని తీయడానికి కూడా వైద్య సిబ్బంది ముందుకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.