Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో అనారోగ్యం.. భూమి నుంచే వైద్యం

By:  Tupaki Desk   |   5 Jan 2020 5:12 AM GMT
అంతరిక్షంలో అనారోగ్యం.. భూమి నుంచే వైద్యం
X
జలుబో.. జ్వరమో వస్తేనే ఆందోళన చెందే రోజులివి. అలాంటిది భూమికి సదూరన ఉన్న అంతరిక్షంలో ఉన్న వ్యోమగామికి తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎలా? అన్న ఆలోచనే వణుకు పుట్టిస్తుంది. ఇంతకీ ఆ అనారోగ్యం మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టటం లాంటి సమస్య అయితే కాళ్లు.. చేతలు ఆడకపోవటమే కాదు.. ఏం చేయాలో తెలీక ఇబ్బంది పడతాం. అయినోళ్లు పక్కనుంటే బాగుండదనుకుంటాం. అలాంటివేమీ అవకాశం లేనప్పటికీ ఆ సమస్యను అధగిమించటం ఒక ఎత్తు అయితే.. భూమి మీద నుంచే ఆ సమస్యను పరిష్కరిస్తూ వైద్యం చేసిన విషయం తాజాగా బయటకువచ్చింది.

ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి ఈ తరహా వైద్యాన్ని అందించిన వైనం తాజాగా చోటు చేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన వ్యోమగామి మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ తరహా సమస్యలకు వైద్యం చేసే నిపుణుడైన ప్రొఫెసర్ స్టీఫన్ మోల్ సాయంతో వైద్యం చేయించారు.

అప్పటికప్పుడు చికిత్సకు అవసరమయ్యే మందుల్ని పంపే అవకాశం లేకపోవటంతో.. తొలుత భూమి మీద నుంచి వైద్యాన్ని షురూ చేశారు. మొయిల్స్ ద్వారా సమాచారం పంపుతూ వైద్యం చేయసాగారు.రక్తం గడ్డ కట్టకుండా చూసేందుకు ప్రత్యేక మందును ఇంజెక్షన్ ద్వారా తీసుకునేవారు. 40 రోజుల పాటు ఈ వైద్యం సాగుతుండగా ప్రత్యేక రాకెట్ ద్వారా వాడాల్సిన మందుల్ని పంపారు. ఇలా మొత్తం మూడు నెలల పాటు వైద్యం సాగింది. మొత్తంగా ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉండాల్సి ఉండగా.. నాలుగు నెలల పాటు వైద్యం సాగింది. అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే నాలుగు రోజుల ముందు చికిత్సను నిలిపివేశారు. భూమ్మీదకు వచ్చేసరికి తదుపరి చికిత్స అవసరం లేకుండానే వ్యాధి నయమైందని చెబుతున్నారు. ఈ తరహాలో వైద్యం చేయటం ఇదే తొలిసారి కావటం విశేషం.