Begin typing your search above and press return to search.

వైరల్: పీపీఈ కిట్ తో డాక్టర్ డ్యాన్స్!

By:  Tupaki Desk   |   4 July 2020 1:30 AM GMT
వైరల్: పీపీఈ కిట్ తో డాక్టర్ డ్యాన్స్!
X
కరోనా వ్యాపించకుండా ఉండడానికి మనం మాస్క్ పెట్టుకోవాలంటేనే కిందా మీద పడుతున్నాం. మూడు నెలలుగా పెట్టుకుంటున్నందుకు మూతికి ఆ మాస్క్ ఉన్నంత మందం తెల్లగా మారిపోతోంది.అలాంటిది రోజంతా రోగులకు సేవలందించే డాక్టర్లు మాస్కులే కాదు.. చేతికి గ్లోజులు, ఒళ్లంతా ప్లాస్టిక్ ఊపిరి ఆడని పీపీఈ కిట్స్ వేసుకుంటే వారి పరిస్థితి ఏంటి? ఉక్కపోతతో భరించలేకుండా ఉంటుంది. అయినా అన్ని ఓర్చుకొని డాక్టర్లు, నర్సులు ఈ పీపీఈ కిట్స్ ధరిస్తూ రోగులకు సేవలందిస్తున్నారు. వారి సేవలకు ప్రశంసలు కురుస్తున్నాయి.

పీపీఈ కిట్ తో వేడి పుడుతుంటే భరించలేకపోయిన ముంబైకి చెందిన డాక్టర్ రిచా నేగి తన బాధను డ్యాన్స్ రూపంలో చెప్పింది. పీపీఈ సూట్ ధరించి అదిరిపోయే స్టెప్పులతో బాలీవుడ్ చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’లోని వేడి పుడుతోందని అర్థం వచ్చే ‘గర్మీ’ పాటకు డ్యాన్స్ చేస్తూ తన బాధను తీర్చుకుంది.ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రిచా పోస్ట్ చేసిన వీడియో వైద్యుల్లో ఉత్సాహం నింపింది. మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులకు సంఘీభావంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల మంది రిచా స్ఫూర్తికి జేజేలు పలికారు.

వీడియో కోసం క్లిక్ చేయండి