Begin typing your search above and press return to search.
లాడెన్ ను పట్టించి.. జైలులో మగ్గుతున్నాడు..!
By: Tupaki Desk | 23 Jan 2018 8:24 AM GMTడాక్టర్ షకీల్ ఆఫ్రిదీ.. ఏడేళ్ల కిందట ప్రపంచం మొత్తం మార్మోగిన పేరు. 2011లో అమెరికా సైనికులు ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ డాక్టర్. అప్పుడు హీరోగా నీరాజనాలందుకున్న షకీల్ ఏళ్లుగా పాకిస్థాన్ జైలులో మగ్గుతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ కుటిల వైఖరికి.. అమెరికా నమ్మకద్రోహానికి బలైపోయి చీకటి గదిలో దుర్భర జీవితం గడుపుతున్నారు. లాడెన్ పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో ఉన్న ఓ ఇంటిలో ఉన్నాడని నిర్ధారించుకునేందుకు అమెరికా డాక్టర్ షకీల్ ను రంగంలోకి దింపింది. ఆయన టీకాల పేరుతో లాడెన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరి డీఎన్ ఏను సేకరించారు. నివేదిక ఆధారంగా అక్కడున్నది లాడెన్ అని నిర్ధారించుకున్న అమెరికా.. పాకిస్థాన్ కు కనీస సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్ నిర్వహించి 2011 మే 2వ తేదీన లాడెన్ ను మట్టుబెట్టింది.
కానీ ఆ తర్వాత అతడి జీవితం తలకిందులైంది. లాడెన్ అంతమైన కొన్నాళ్లకు పాకిస్థాన్ ప్రభుత్వం షకీల్ ను అదుపులోకి తీసుకుంది. ఖైబర్ కనుమల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉగ్రవాదులకు షకీల్ ఆశ్రయం కల్పించారని గిరిజన చట్టాల కింద కేసు నమోదు చేసింది. ఇలాంటి కేసులను ప్రత్యేక న్యాయస్థానాలు విచారిస్తాయి. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. కోర్టులు విచారణను ఏళ్లపాటు సాగదీస్తాయి. 2012 నుంచి కనీసం అతడి లాయర్ ను కూడా కలుసుకోనివ్వడం లేదు. భార్యాపిల్లలను మాత్రమే అప్పుడప్పుడు అనుమతిస్తున్నారు. కోర్టులు సైతం షకీల్ కు సహకరించడం లేదని అతడి తరఫు లాయర్ నదీమ్ అఫ్రీదీ పేర్కొన్నారు. షకీల్ కేస్ ఫైల్ కనిపించడం లేదంటూ రెండేళ్లపాటు విచారణ వాయిదా వేశారని, ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేరంటూ విచారణ చేపట్టడం లేదని వాపోయారు.
అమెరికాకు సాయం చేసినందుకు రాజద్రోహం కింద కేసు నమోదు చేస్తే సాధారణ కోర్టుల్లో విచారణ చేపట్టాలని, ఆ అవకాశం ఇవ్వొద్దనే కుట్రతోనే గిరిజన చట్టాల కింద కేసు నమోదు చేశారన్నారు. షకీల్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన వారు వరుసగా హత్యకు గురవుతున్నారు. గతంలో షకీల్ తరఫున వాదించడానికి ప్రయత్నించిన లాయర్ ను పెషావర్ లోని అతడి ఇంటి ముందే తుపాకీతో కాల్చి చంపారు. షకీల్ కు సాయం చేసేందుకు ప్రయత్నించిన పెషావర్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ప్రస్తుతం షకీల్ కేసును వాదిస్తున్న నదీమ్ పైనా హత్యాయత్నం జరిగింది.
కాగా, తన స్వార్థం కోసం షకీల్ ను వాడుకున్న అమెరికా ఆ తర్వాత అతడిని విడిపించేందుకు పెద్దగా ప్రయత్నించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం రెండే నిమిషాల్లో షకీల్ ను బయటికి తీసుకొస్తా అని 2016లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పాక్ కు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడంతో షకీల్ ఆశలు మరింత సన్నగిల్లాయి. ఇప్పుడు అతడిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో షకీల్ గురించి కనీసం చర్చించలేదని పలు అంతర్జాతీయ సంస్థలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ మాత్రం షకీల్ అంశం తమ దృష్టిలో ఉన్నదని చిన్న ప్రకటన ఇచ్చింది. షకీల్ పెద్ద చిక్కుముడిలో ఇరుక్కున్నారని, పాకిస్థాన్ - అమెరికా మధ్య మళ్లీ సత్సంబంధాలు నెలకొనేవరకు ఆయనకు దుర్భర జీవితం తప్పకపోవచ్చని పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ డైరెక్టర్ మహ్మద్ అమీర్ రాణా పేర్కొన్నారు.