Begin typing your search above and press return to search.
నిన్న చంపే ప్రయత్నం.. నేడు చచ్చిపోయాడు
By: Tupaki Desk | 9 Feb 2016 5:42 AM GMTహైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించిన వైద్యుల కాల్పుల వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ముగ్గురు డాక్టర్లు కలిసి మాదాపూర్ లో లారెల్ ఆసుపత్రిని ప్రారంభించారు. భాగస్వామ్య డాక్టర్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు నిన్న కలిసిన ముగ్గురు వైద్యుల్లో.. డాక్టర్ శశికుమార్ తన వద్దనున్నలైసెన్స్ రివాల్వర్ తో డాక్టర్ ఉదయ్ కుమార్ మీద ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అనంతరం ఆయన పారిపోయాడు. ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. అనంతరం డాక్టర్ శశికుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఆయనకు సంబంధించిన ఫాంహౌస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లిలో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. అయితే.. కాల్పులు జరిపిన శశికుమార్ విగతజీవుడైన కనిపించాడు. రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని మరణించినట్లుగా భావిస్తున్నారు. ఆసుపత్రి నిర్వహణ విషయంలో వైద్యులు సాయికుమార్.. ఉదయ్ లు మోసగించారని.. ఉదయ్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖలో పేర్కొనటం గమనార్హం.
అంతేకాదు.. డాక్టర్ ఉదయ్ మీద కాల్పులు జరిపింది తాను కాదని.. సాయికుమార్ కాల్చటంతో తాను భయపడి వచ్చేశానని శశికుమార్ సూసైడ్ నోట్ లో పేర్కొనటం గమనార్హం. భార్యా.. పిల్లలు తనను క్షమించాలని.. లోరల్ ఆసుపత్రి వివాదంలో తనను అనవసరంగా ఇరికించారని పేర్కొన్నారు. ఫాంహౌస్ లో మృతదేహంతో పాటు.. నాలుగు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉన్నత చదువులు చదివిన వైద్యుల మధ్య విభేదాలు వచ్చినా.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటం.. సాధ్యం కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్పించి ఇలా కాల్పులు జరపటం.. అనంతరం ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా వైద్యుల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.