Begin typing your search above and press return to search.

కరోనా అంతు చూసేందుకు గాఢ్ ఫాదర్ రంగంలోకి..!

By:  Tupaki Desk   |   26 April 2020 5:16 AM GMT
కరోనా అంతు చూసేందుకు గాఢ్ ఫాదర్ రంగంలోకి..!
X
కరోనాకు మూడినట్లేనా? ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి అంతు చూసేందుకు ‘గాడ్ ఫాదర్’ రంగంలోకి వచ్చారు. ఇంత బిల్డప్ ఏమిటంటారా? ఈ పెద్దాయన గురించి పూర్తిగా తెలిస్తే.. ఈ మాత్రం అవసరమేనని అనుకోవటం ఖాయం. 1960లో అమెరికాను కకావికలం చేసిన రుబెల్లా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయటంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ స్టాన్లీ ప్లాట్ కిని ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడాయన వయసు 87 ఏళ్లు. ఇండస్ట్రీలో ఆయనకున్న ముద్దుపేరు గాడ్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్ గా పిలుచుకునే ఆయన.. కరోనా సంగతి చూసేందుకు స్వయంగా ల్యాబ్ కు వస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రముఖ అమెరికన్ పార్మా కంపెనీలతో పని చేసేందుకు ఆయన రెఢీ అవుతున్నారు. తాను వ్యాక్సిన్ కనిపెట్టిన రుబెల్లా వైరస్ కు.. కరోనాకు మధ్య తేడా చాలా ఉందంటున్నారు. రుబెల్లా వ్యాధితో అందరికి ముప్పు ఉన్నప్పటికీ గర్భిణుల పాలిట మాత్రం ప్రాణాంతకంగా ఉండేది. అప్పట్లో ప్రతి వందమంది గర్భిణుల్లో ఒకరిని రుబెల్లా బలి తీసుకునేది. కరోనా వైరస్ అందుకు భిన్నమంటున్నారు. ఆదమరిస్తే అందరిని బలి తీసుకునేంత డేంజరంటున్న ఆయన.. దీని కారణంగా పెద్ద వయస్కుల వారికి ఇబ్బంది ఎక్కువన్నారు.

రుబెల్లా మాత్రమే కాదు.. పోలియో.. ఆంత్రాక్స్.. రేబిస్.. రోటా వైరస్ లకు టీకాల్ని డెవలప్ చేసిన బ్యాక్ గ్రౌండ్ ఈ పెద్దాయన సొంతం. వైరస్ లను ఎలా నిర్వీర్యం చేయాలన్న విషయంపై ఆయనకున్న పట్టు అపారమని చెబుతారు. అందుకే కరోనా సంగతి చూసేందుకు ఆయన రంగంలోి దిగారు. వ్యాక్సిన్లు డెవలప్ చేయటమంటే సినిమాల్లో సీన్ మార్చినంత ఈజీ కాదంటున్న ఆయన.. దాని వెనుక ఎంతో శ్రమతో పాటు.. అనేక దశల ప్రయోగ పరీక్షలు ఉంటాయని చెప్పారు. గతంలో వ్యాక్సిన్ల తయారీకి ఏళ్లకు ఏళ్లు పట్టేవని.. మారిన సాంకేతికతో ఏడాది.. ఏడాదిన్నర కాలంలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి.. గాడ్ ఫాదర్ రంగంలోకి దిగిన వేళ.. కరోనాకు మూడినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. మరి.. కాలం ఏమని డిసైడ్ చేస్తుందో చూడాలి.