Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు డాక్టర్ ఇచ్చిన సలహా అదేనా!
By: Tupaki Desk | 27 April 2019 2:30 PM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఆరోగ్యం మీద అనేక మంది ఇప్పటికే కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేత కేవీవీ రామచంద్రరావుతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు చేసే గందరగోళ ప్రకటనలు వారి కామెంట్లకు అవకాశం ఇస్తూ ఉంటాయి. బాబు పూర్తి అసంబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని సార్లు. అలాంటి సందర్భాల్లో ఆయన ప్రత్యర్థులు ఆయన ఆరోగ్యం మీద అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.
దీని ప్రకారం.. ఇటీవలే చంద్రబాబు నాయుడు మరోసారి వైద్యులను కన్సల్ట్ అయ్యారట. ఆ సమయంలో వైద్యులు బాబుకు ఒక సలహా ఇచ్చినట్టుగా సమాచారం. అదేమిటంటే.. రెస్ట్ తీసుకోవడం. బాబు వయసు రీత్యా
ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండటం మంచిదని, ఆయన విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారట. ‘మీ ఏజ్ లో స్ట్రెస్ పడకూడదు. అది రిస్క్ అవుతుంది. మీరు ఎప్పుడూ స్ట్రెస్ బాల్ వాడండి…’అని వైద్యులు సలహా ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
అలాగే ప్రశాంతంగా ఉండాలని, హిమాలయలకు వెళ్లి ఆ ప్రశాంతతను ప్రాక్టీస్ చేయాలని వారు సలహా ఇచ్చినట్టుగా సమాచారం. అందుకే నారా ఫ్యామిలీ ఈ సమ్మర్ వెకేషన్ కు కూడా అటు వైపే వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి లోగుట్టు ఏమిటో!
ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా బాబు ఆరోగ్యం మీద రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగా కొత్త ప్రచారం సాగుతూ ఉంది.