Begin typing your search above and press return to search.
హిందువులకు వైద్యం ఆపేస్తానన్న డాక్టర్
By: Tupaki Desk | 24 Jun 2017 4:52 AM GMTమతం మొత్తంగా ఆవహించి.. మూర్ఖత్వంతో వ్యవహరించటం.. తమ మతాన్ని ఎంతగా ఆరాధిస్తారో.. ఎదుటివారి మతాన్ని అంతగా ద్వేషించటం.. నోరు జారి మాట్లాడటం ఈ మధ్యన కొందరు చేస్తున్నారు. ఇలా చేస్తూ అడ్డంగా బుక్ అయిన లేడీ డాక్టర్ ఉదంతమిది.
సోషల్ మీడియాలో మొదలైన మాటలు.. సదరు మహిళా డాక్టర్ నోరు జారేలా చేయటమే కాదు.. సదరు లేడీ మామూలుది కాదని.. పెద్ద కిలేడీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ జరిగిందేమంటే.. ముంబయికి చెందిన ముస్లిం మహిళా డాక్టర్ అనీఖా గనీ నోరు జారి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.
మతం గురించి జరిగిన చర్చ హద్దులు దాటటం.. ఈ సందర్భంగా సదరు వైద్యురాలు ఆవేశానికి గురై.. కీర్తన్.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడితే.. మా డయాలసిస్ వార్డులో డయాలసిస్ చేసుకుంటున్న హిందూ రోగులందర్ని వెళ్లగొట్టేస్తా.. చచ్చి ఊరుకుంటారు అంటూ కస్సుమన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి.
అక్కడితో ఆగని ఆమె.. ముస్లింల మీద ఫేస్ బుక్ సాక్షిగా దాడికి దిగే పిరికివారు నేరుగా పాక్ కు వెళ్లి యుద్ధం చేయాలంటూ సలహా ఇవ్వటం పలు విమర్శలకు తావిచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆమె గురించి అధికారులు దృష్టి సారించారు. ఆమె వ్యాఖ్యలపై భారతీయ వైద్యుల సంఘానికి ఫిర్యాదులు రావటంతో అనీఖా గనీ సర్టిఫికేట్ గురించి వెదుకులాటను అధికారులు షురూ చేశారు.
ఈ సందర్భంగా అవాక్కు కావటం అధికారుల వంతైంది. ఎందుకంటే.. ఆమె ఐఎంఏ సభ్యురాలు కాదని.. మహారాష్ట్ర వైద్య మండలి సభ్యురాలుకాదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. డాక్టర్ గా చెలామణి అవుతున్న అనీఖా గనీ అసలు డాక్టరేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మతం ప్రాతిపదికన వైద్యాన్ని నిరాకరిస్తానన్న అనీఖా డిగ్రీలు అసలువా? నకిలీవా? అన్నది తేల్చాలని నిర్ణయించారు. అంతేకాదు. . సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మతం పేరుతో వైద్యాన్ని నిరాకరించటం నేరంగా వారు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/