Begin typing your search above and press return to search.
కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టేశా అంటున్న బెంగుళూరు డాక్టర్!
By: Tupaki Desk | 28 March 2020 6:10 AM GMTకరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ కి నివారణ మందు లేకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ భయంకరమైన కరోనా వైరస్ కు మందు కనుగొన్నానని బెంగళూరుకు చెందిన వైద్యుడు విశాల్ రావు తెలిపారు. కానీ అది ఫస్ట్ స్టేజీలో ఉందని వివరించారు. ప్రజల ప్రాణాలను తోడేస్తున్న కరోనాకు మందు కనుక్కొన్నామని చెప్పడం కొంచెం ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.
అయితే , అయన తయారు చేసిన ఈ మెడిసిన్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చి, పరిశోధన జరిగితే గానీ అందుబాటులోకి రాదు. ఇకపోతే , బెంగళూరుకు చెందిన విశాల్ రావు ప్రస్తుతం అంకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ కు మందు కనుక్కొన్నామని తెలిపారు. వైరస్ ప్రబలిన రోగుల్లో సైటోకిన్ ను రోగుల్లో ఇంజెక్ట్ చేస్తామని , ఇది వైరస్ నిర్మూలన ప్రారంభ దశ అని.. వారంలోగా తుది దశకు చేరుకుంటామని వివరించారు. వైరస్ నివారణ మందు పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు అయన తెలిపారు.
ఏదేమైనా కూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి మందు కనుక్కొనే వైపుకి మన దేశంలో కూడా అడుగు పడటం శుభ పరిణామం. దీనికి ప్రభుత్వం అనుమతిచ్చి.. పరిశోధనలు చేస్తే - వైరస్ కు విరుగుడు మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వైరస్ ప్రబలిని వారిని వ్యాధి నుంచి కాపాడే అవకాశం ఉంది. దీనితో ఇప్పుడు కరోనా కి మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న విశాల్ రావు ప్రయోగం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే ,విశాల్ రావుకి సపోర్ట్ చేసేందుకు మిగతా వైద్యులు కూడా ముందుకురావడం శుభపరిణామం.