Begin typing your search above and press return to search.

భారత్ తొలి కరోనా బాధితుడికి చికిత్స చేసిన డాక్టర్‌ కు కరోనా పాజిటీవ్ !

By:  Tupaki Desk   |   18 March 2020 11:20 AM GMT
భారత్ తొలి కరోనా బాధితుడికి చికిత్స చేసిన డాక్టర్‌ కు కరోనా పాజిటీవ్ !
X
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతున్న అత్యంత ప్రమాదకరమైన వైరస్. ఈ వైరస్ బయటపడి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు సరైన మందు కనిపెట్టలేదు. కేవలం కరోనా సోకకుండా నివారణ చర్యలు మాత్రమే తీసుకోండి అని ప్రచారం చేస్తున్నారు. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతూ అందరిని భయపడేలా చేస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా వల్ల ముగ్గురు చనిపోయారు.

ఇక విదేశాల నుంచి భారత్‌ కు వచ్చిన 76ఏళ్ల మొదటి కరోనా బాధితుడు మార్చి 11న మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే , తాజాగా భారత్ మొదటి కరోనా బాధితుడికి చికిత్స అందించిన 63ఏళ్ల వైద్యుడికి కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్దారించారు. అతడికి నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటీవ్ వచ్చింది. హైదరాబాద్ లోని ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీలో కరోనా లక్షణాల తో వైద్యుడు చేరకమందు కర్ణాటకలోని కలబురాగిలో బాధితుడికి ఈ డాక్టరే చికిత్స అందించారు. డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ బెంగళూరులోని వైరాలాజీకి పంపారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ బి. శరత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

అయితే, అయన తన ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇంట్లోనే నిర్బందంలో ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. మరోవైపు అధికార యంత్రాంగం ఈఎస్ ఐ ఆస్పత్రుల్లో 200 పడకల ఐసోలేషన్ వార్డును కూడా ప్రారంభించింది. అయినప్పటికీ బాధితుడు ఐసోలేషన్ వార్డుకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు. మార్చి 15న తన 45ఏళ్ల కుమార్తె టెస్టు పాజిటీవ్ తేలిన తొలి బాధితురాలిగా గుర్తించినప్పటి నుంచి ఆయన తన ఇంట్లోనే నిర్బందాన్ని కొనసాగిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. డాక్టర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. అయన ఐసోలేషన్ వార్డ్ కి తరలిస్తారా?లేక అయన ఇంట్లోనే ఉంటారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.