Begin typing your search above and press return to search.

కర్నూలు జీజీహెచ్ కలకలం..మృతదేహాల తారుమారు షాక్ లో కుటుంబ సభ్యులు!

By:  Tupaki Desk   |   12 May 2020 1:00 PM GMT
కర్నూలు జీజీహెచ్ కలకలం..మృతదేహాల తారుమారు  షాక్ లో కుటుంబ సభ్యులు!
X
కర్నూలు GGH ఆస్పత్రి మార్చురీలో మృతదేహలు తారుమారైంది. రెండు మృతదేహాల్లో ఒకటి కరోనా సోకిన వ్యక్తిది కాగా, మరొకటి కరోనా సోకని అనుమానిత వ్యక్తికి చెందినది. అయితే, డాక్టర్లు గందరగోళంలో వైరస్ సోకని వ్యక్తికి చెందిన మృతదేహాన్ని, వైరస్ సోకిన వ్యక్తిగా భావించి, ఆ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేశారని , కరోనా పాజిటివ్ వచ్చిన మృతదేహాన్ని మార్చురీ లోనే ఉంచారని, మూడ్రోజుల తర్వాత ఆ మహమ్మారి సోకని వ్యక్తికి చెందిన బంధువులు మృతదేహం కోసం రాగా జరిగిన తప్పిదం వెలుగులోకి వచ్చిందని .. విషయం తెలిసిన ఆ మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన రాంబాబు కొద్దిరోజుల క్రితం ఆయాసంతో జీజీహెచ్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 9న అతను మృతి చెందాడు. చనిపోయిన తర్వాత మృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సోమవారం మెడికల్ రిపోర్టులు రాగా.. అందులో రాంబాబుకు కరోనా నెగటివ్‌గా తేలింది. దీనితో మృతదేహాన్ని తీసుకెళ్లమని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో బంధువులు, ఇవాళ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ , వారు మార్చురీకి వెళ్లి చూస్తే, రాంబాబు మృతదేహం కనిపించలేదట...అక్కడ మరొకరి మృతదేహం అక్కడ ఇంకో శవం ఉందని, ఆ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వ్యక్తి అని , ఆ మృతదేహమే రాంబాబుది అనుకొని తీసుకోని వెళ్లారని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

దీనికి ప్రధాన కారణం ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి పేరు కూడా దాదాపు అలాంటి పేరే అని, అందుకే హాస్పిటల్ సిబ్బంది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి అని, జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంపై రాంబాబు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని తమవాడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు అని ప్రచారం అవుతుంది. ఇక్కడ మరో విషయమేంటంటే ...ఆ మృతదేహాన్ని కరోనా పాజిటివ్ వ్యక్తిగా భావించి.. అక్కడి సిబ్బంది దాదాపు 10 అడుగుల లోతులో పూడ్చి పెట్టి ఖననం చేశారట. అయితే , దీనిపై హాస్పిటల్ అధికారులు కానీ , ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన అయితే రాలేదు. కేవలం ప్రచార మద్యంలో ప్రచారం అవుతుంది. ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన వస్తే కానీ ఇందులోని నిజానిజాలేవో వెల్లడికావు.