Begin typing your search above and press return to search.
కరోనా వైరస్: డాక్టర్లకు - నర్సులకు కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు
By: Tupaki Desk | 2 Feb 2020 4:46 PM GMTచైనాలో పుట్టి - ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. చైనీయులు అంటేనే.. చైనా నుంచి వచ్చారు అంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. వివిధ దేశాల్లో చైనీయులను రెస్టారెంట్లకు - హోటళ్లకు కూడా రానీయడం లేదు. చైనా నుంచి తమ దేశానికి వచ్చే వారిని సంపూర్ణంగా పరీక్షిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇది బాధితులు లేదా సామాన్యుల వైపు కోణం. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కరోనా వైరస్ అంటేనే ప్రత్యేక వార్డుల్లో అత్యంత కట్టుదిట్టంగా చికిత్సను అందిస్తున్నారు. కానీ ఆ చికిత్స అందించే డాక్టర్లు, వారికి సహకరించే నర్సుల పరిస్థితి ఏమిటి?
ఎంత మాస్కులు ధరించినా... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... తమ కుటుంబ సభ్యులైన డాక్టర్లు/నర్సులు కరోనా వైరస్ రోగులకి చికిత్స అందిస్తున్నారంటే వారి కుటుంబం ఆందోళన అంతాఇంతా కాదు. తమ వారికి ఏమవుతుందోననే ఆందోళన డాక్టర్లు - నర్సుల కుటుంబాల్లోనూ సహజమే. చైనాలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఎంతోమంది డాక్టర్లు - నర్సులు వెళ్తున్నారు. వారిని వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీటితో సాగనంపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో - మీడియాలో చూస్తే గుండె తరుక్కుపోతోంది.
చికిత్స అందించేందుకు వెళ్లే డాక్టర్లు - నర్సులు నిజంగా ధైర్యవంతులే. దీనిని 'కరోనా వైరస్ సూసైడ్ మిషన్'గా అభివర్ణిస్తున్నారు. వీరిలో చాలామంది తాము ఎంతగానో ప్రేమించి తమ కుటుంబ సభ్యులను చూసేందుకు తిరిగి రాకపోవచ్చు. ఇది తెలిసీ వెళ్తున్న వారి గుండె ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా వైరస్ నేపథ్యంలో WHO చైనాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇంకా ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మాత్రం ప్రకటించలేదు. 2019లో జంతువుల నుండి మనుషులకు ఈ వైరస్ సోకినట్లుగా భావిస్తున్నారు. సీఫుడ్ తినడం వల్ల వ్యాప్తిచెందినట్లుగా చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాణాంతక వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాప్తిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ల/నర్సులు/మెడికల్ వాలంటీర్లని మరిచిపోయాం. వీరికి వారి కుటుంబ సభ్యులు - బంధువులు కన్నీటి పర్యంతమవుతూ... వూహాన్ వెళ్లేందుకు వీడ్కోలు పలుకుతున్నారు. ఇది చెర్నోబిల్ లాంటి సూసైడ్ మిషన్ గా భావిస్తున్నారు. 1986లో జరిగిన ఘోరమైన అణువిపత్తు చెర్నోబిల్. ఇప్పుడు కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు డాక్టర్లు - నర్సులు - మెడికల్ వాలంటీర్ల కుటుంబ సభ్యులు - బంధువులు - స్నేహితులు కన్నీటితో.. బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. చెర్నోబిల్ పైర్ సిబ్బంది వలె వీరిలో కూడా కొందరు వెనక్కి తిరిగి రాకపోవచ్చునని సోలోమన్ యూ అమెరికన్ రాజకీయ నాయకుడు ట్వీట్ చేశారు. ఇది కరోనా వైరస్ సూసైడ్ మిషన్ అని, దేవుడు వారిని ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఓ డాక్టర్ తన భార్యతో చివరిసారి బ్రేక్ ఫాస్ట్ చేసిన రికార్డును కూడా పొందుపరిచారు.