Begin typing your search above and press return to search.
కరోనా చికిత్స పై హెచ్చరికలు జారీచేసిన వైద్యుల!
By: Tupaki Desk | 15 Sept 2020 1:20 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై .. సుమారు ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో వైద్య నిఫుణుల సలహాలు, సూచనలు అత్యంత కీలకంగా మారాయి. ఎవరికి తోచి విధంగా వారు సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటూ అమాయకులను తప్పు దారి పట్టిస్తున్న నేపథ్యంలో వైద్య నిఫుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత మెజార్టీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైనది ఏం కాదు. అయితే ఆ వైరస్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని అంటున్నారు డాక్టర్ అర్జా శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ కరోనా స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ .. తాజాగా రాష్ట్ర యువతకు ముఖ్యంగా నలభై ఏళ్లకు అటు ఇటుగా ఉన్న వ్యక్తుల నిర్లక్ష్యానికి సంబంధించి కీలకమైన సూచనలు చేశారు. ఈ మేరకు డాక్టర్ శ్రీకాంత్ వివిధ వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనలను క్రోడీకరిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి అంశాల్లో అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో ఆస్పత్రులకు వెళ్ళే విషయాల్లో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని, మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపుల తరువాత యువత బయట తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ముగ్గురేసి ప్రయాణించడం కూడా కోవిడ్ వైరస్ విస్తృతికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 ఏళ్లలోపు వారు 55శాతం మంది ఉన్నారని.. యువత మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే ఫలానా మందులు వాడండి, ఫలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి సమస్యను కొని తెచ్చుకుంటున్నారని , సొంత వైద్యం చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కాలంలో యువత ఉపాధి, ఉద్యోగాల కోసం బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే యువత వైరస్ బారిన పడుతున్నారు. అదే సమయంలో మరికొందరు యువకులు బయట తిరిగే సమయంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువత లో ఎక్కువ మందికి వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా నిర్ధారణ పరీక్షలకు వెళ్ళడం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఓవైపు కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంటే.. మరోవైపు సీజన్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం సాధారణమే అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని , కోవిడ్ బారినపడిన వారిలో అధికశాతం మంది మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం వంటి లక్షణాల కారణం గా చని పోతున్నారు. కోవిడ్ నన్నేమీ చేయ లేదు అనే గుండెనిబ్బరం ఉన్నవారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లినా తిరిగి కోలుకుంటున్నారని చెప్తున్నారు.